36.2 C
Hyderabad
April 18, 2024 11: 52 AM
Slider ముఖ్యంశాలు

భక్తులతో దురుసుగా ఏ ఒక్క‌రూ ప్రవర్తించవద్దు…!

#vijayanagarampolice

శ్రీశ్రీ శ్రీ పైడితల్లమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులతో భద్రతా సిబ్బంది ఎవ్వరూ దురుసుగా ప్రవర్తించవద్దని విశాఖ  రేంజ్ డిఐజి ఎల్.కే.వి. రంగారావు అన్నారు. అమ్మవారి తొలేళ్ళు, సిరిమానోత్సవ బందోబస్తు నిర్వహించేందుకు వచ్చిన పోలీసు  సిబ్బందికి విశాఖ  రేంజ్ డిఐజి ఎల్. కే.వి.రంగారావు, జిల్లా ఎస్పీ ఎం. దీపిక దిశా నిర్దేశం చేసారు.

ఈ సందర్భంగా  విజ‌య‌న‌గ‌రం  బేర‌క్స్ లో బందోబ‌స్తు సిబ్బందిని ఉద్దేశించి పోలీస్ ఉన్న‌తాధికారులు మాట్లాడారు.  రేంజ్ డిఐజి ఎల్. కే.వి.రంగారావు మాట్లాడుతూ – 21 సెక్టార్లులో ఏర్పాటు చేసిన బందోబస్తులో ఎవరు, ఏవిధమైన డ్యూటీ నిర్వహించాలన్న విషయాలపై ప్రతీ ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలన్నారు. 

వారు విధులు నిర్వహించే ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ప్రజలు ఎక్కడా గుమిగూడకుండా చూడాలని, దర్శనాలకు వచ్చే వారిని, ఆన్ లైను టిక్కెట్లు, రెవెన్యూశాఖ జారీ చేసిన పాట్లు ఉన్న వారిని మాత్రం అనుమతించాలన్నారు. ప్రజలతో ఎవ్వరూ కూడా దురుసుగా ప్రవర్తించ వద్దన్నారు.

ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, తాము నిర్వహించే విధులు పట్ల ప్రతీ ఒక్కరూ స్పష్టత కలిగి ఉండాలన్నారు. సెక్టరు ఇన్ చార్జ్ లుగా వ్యవహరించే అధికారులు తమ సెక్టార్లులో విధులు నిర్వహించే భద్రతా సిబ్బందికి ఎప్పటికప్పుడు తగిన సూచనలివ్వాలని అధికారులను డిఐజి ఎల్.కే.వి. రంగారావు ఆదేశించారు. అంత‌కు ముందు ఎస్పీ దీపికా మాట్లాడుతూ…మ‌రీమ‌రీ చెబుతున్నా….సిబ్బందిఎవ్వ‌రూ దురుసుగా వ్య‌వ‌హ‌రించొద్ద‌ని, మ‌ర్యాద‌గామాట్లాడాల‌ని హిత‌వు ప‌లికారు.

క‌రోనా లేదు అన్న అలసత్వాన్ని భద్రతా సిబ్బంది ప్రదర్శించ వద్ద‌ని…  ఒక్కరూ తప్పనిసరిగా డబుల్ మాస్క్ ధరించాలని, శానిటైరును తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలన్నారు. భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలని, ఏ సమస్య ఉన్నా వెంటనే డాక్టరు ఇన్ చార్జ్ ల దృష్టికి తీసుకొని వెళ్ళాలన్నారు.

ఏ సెక్టరులో సమస్య ఉన్నా సామరస్యంగా పరిష్కరించాలని, అదనపు సిబ్బంది అవసరమైనట్లుగా భావిస్తే, సమాచారాన్ని కమాండ్ కంట్రోల్ కు అందిస్తే, రిజర్వులో ఉన్న పోలీసు సిబ్బందిని వెంటనే అక్కడకు పంపుతామన్నారు. అదే రోజు వర్షం పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ సూచించినందున ప్రతీ ఒక్కరూ రెయిన్ కోట ను తమ వెంట తెచ్చుకోవాలన్నారు.

సిరిమానోత్సవం ముగిసిన తరువాత ఎవ్వరూ బాధ్యతారాహిత్యంగా విధుల నుండి వెళ్ళిపోవద్దన్నారు. ఉన్నతాధికారుల నుండి తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు తమకు కేటాయించిన ప్రాంతంలోనే విధులు నిర్వహించాలని భద్రతా సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సత్య‌నా రాయణరావు, ఒఎస్ డి ఎన్.సూర్యచంద్రరావు, విజయనగరం డిఎస్పీ అనిల్ పులిపాటి, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు, బొబ్బిలి డిఎస్పీ బి.మోహనరావు, పార్వతీపురం డీఎస్పీ ఎ.సుభాష్, ఎస్సీ ,చ ఎస్టీ సెల్ డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, దిశ  పీఎస్  డిఎస్పీ టి. త్రినాధ్, ఎఆర్ డిఎస్పీ ఎల్.శేషాద్రి, పిటిసి డిఎస్పీలు హస్మాన్ ఫర్హీన్, వెంకట అప్పారావు, బాలరాజు పలువురు సీఐలు , ఆర్ఎస్ఏలు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

మునిసిపల్ కార్మికుల యోగక్షేమాలు అడిగిన చైర్మన్

Satyam NEWS

“బ‌జార్ రౌడి” తో స్టెప్పులేయించిన ప్రేమ్ ర‌క్షిత్‌

Satyam NEWS

ఎడ్వయిజ్: చౌకబారు విమర్శలు మానుకోండి

Satyam NEWS

Leave a Comment