36.2 C
Hyderabad
April 25, 2024 20: 19 PM
Slider నల్గొండ

అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరు

#CITU Hujurnagar

దేశవ్యాప్త పిలుపులో భాగంగా సూర్యాపేటలో శాంతియుతంగా సేవ్ ఇండియా నిరసన చేస్తుంటే పోలీసులు అరెస్టు చేయడం సరైంది కాదని ఈ విషయాన్ని పార్టీలకతీతంగా అందరూ ఖండించాలని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షులు శీతల రోష పతి కోరారు.

సూర్యపేటలో నాయకుల అరెస్ట్ లకు హుజూర్ నగర్ లో కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రోషపతి మాట్లాడుతూ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సి ఐ టి యు, అరెస్టులకి, లాఠీచార్జీలకి భయపడే సంఘాలు కాదని,ప్రజల కోసం ఫలితం వచ్చేంత వరకు అనేక పోరాటాలు చేసిన చరిత్ర ఉందని,పోరాటాలు చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని హెచ్చరించారు.

కేంద్ర లోని బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాల సవరణ ప్రైవేటీకరణ నిలుపుదల  చేయాలని, రైతు ఋణాలను ఒకేసారి రద్దు చేయాలని,మున్సిపల్ పట్టణాలలో వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధి హామీ పని అవకాశం ఇవ్వాలని, రోజుకి ఆరు వందలు చొప్పున కూలి ఇవ్వాలని,జిల్లాలోని ప్రతి ఒక్క గ్రామంలోని అందరిని ఆరోగ్యశ్రీ కింద కరోనా పరీక్ష చేయాలి కోరారు. ఈ కార్యక్రమంలో దుర్గారావు, రవి, సైదులు, వెంకన్న, పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related posts

విజయనగరం డీఎస్పీ కి ఏఎస్పీ గా పదోన్నతి

Satyam NEWS

రామంతపూర్ చిన్న చెరువు దుర్వాసన అరికట్టండి

Satyam NEWS

ఎన్నికల కమిషనర్ విధినిర్వహణకు కిరికిరి పెట్టవద్దు

Satyam NEWS

Leave a Comment