27.7 C
Hyderabad
April 24, 2024 09: 12 AM
Slider ముఖ్యంశాలు

గొర్రెలను అడిగితే అక్రమ అరెస్టులా?

#PoliceArrest

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5వేలకోట్లతో గొల్లకురుమలకు గొర్రెలిచ్చి కోటీశ్వరులను చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకొనిగెలిచి అధికారంలోకి వచ్చాక కుచ్చటోపి పెట్టాలనిచూస్తే సహించేది లేదని గొర్రెలు, మేకలపెంపకందారుల సంఘం జిల్లా కార్యదర్శి అవిశెట్టి శంకరయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

సోమవారం నాడు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో బాగంగా నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రం లో రెండవ విడత గొర్రెలపంపిణీ ప్రారంభించాలని శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడానికి వచ్చిన వారిని పోలీసులతో అరెస్టు చేయించి ప్రజాస్వామ్య హక్కును కాలరాస్తుందని విమర్శించారు.

రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభం చేసి ఇచ్చినహామీా ప్రకారం డిడిలు కట్టినవారితోపాటు మిగిలిన లబ్దిదారులందరికి గొర్రెలు ఇవ్వాలని, ప్రతి సొసైటీకి 20ఎకరాల భూమి ఇవ్వాలని, పశువైద్యశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, సంచార వాహనాల ద్వారా జీవాలకు వైద్యం అందించాలని, నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి షెడ్లలో గొర్రెలను పెంచటానికి 30 లక్షల రూపాయలు సబ్సిడీ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందంచాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో యాదవమహాసభ జిల్లా కార్యదర్శి జడల చిన్న మల్లయ్య, కెవిపియస్ జిల్లా నాయకులు జిట్ట నగేష్, జియంపియస్ జిల్లా నాయకులు నారబోయిన శ్రీనివాస్, రెముడాల లింగస్వామి, సంఘం. అధ్యక్షులు తెల్సుారి బిక్షం, కంపె మల్లయ్య, వెంకన్న, తరాలశ్రీను, కిరణ్, మెట్టు నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఒక్క డీజీపీ త‌ప్ప మిగిలిన వారెవ్వ‌రూ మాస్క్ ధ‌రింలేదు..!

Satyam NEWS

ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు అనునిత్యం తపన

Satyam NEWS

ఘనంగా ఎమ్మెల్యే రెడ్యా నాయక్ జన్మదిన వేడుకలు

Satyam NEWS

Leave a Comment