29.2 C
Hyderabad
October 10, 2024 20: 25 PM
Slider రంగారెడ్డి

గర్భంలో ఉన్న ఆడపిల్లలను చిదిమేస్తున్న కిలాడీ ముఠా

abortion-750x500

లింగనిర్దారణ పరీక్షలు నిర్వహించడం చట్ట విరుద్ధం. ఈ అంశాన్ని సొమ్ముగా మార్చుకుంటున్నారు కొందరు. ఇప్పటి వరకూ డయాగ్నాస్టిక్ సెంటర్ల వారు ఇలాంటి పనులు చేసేవారు. అయితే ఇప్పుడు కొన్ని ముఠాలు తయారయ్యాయి. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి ఆడపిల్ల అయితే గర్భస్రావం(అబార్షన్) చేయించేందుకు మొత్తం ప్యాకేజీ మాట్లాడుకుంటున్నారు హైదరాబాద్ లో ఒక ముఠా. ఈ సమాచారం సమాచారం అందుకున్న రంగారెడ్డి జిల్లా ప్రొగ్రామింగ్ ( వైద్య శాఖ ) అధికారి బాల నరేందర్ చైతన్య పురి పోలీసుల కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు రాచకొండ షీ టీమ్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి సంయుక్తంగా చేపట్టిన డెకాయ్ ఆపరేషన్ లో నిర్ఘాంతపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. చైతన్య పురి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొంతమంది మధ్యవర్తులు ( బ్రోకర్స్) గర్భవతి మహిళలకు పుట్టబోయేది ఆడ బిడ్డ లేదా  మగ బిడ్డ అని తెలియచేసేందుకు లింగస్థ గర్భ నిర్దారణ పరీక్షలు నిర్వహించి ఆడపిల్ల అయితే అబార్షన్ చేపిస్తాం అని చెప్పి ముగ్గురు గర్భవతుల నుంచి ఒక్కొక్కరి వద్ద 9.వేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. వారివద్ద డబ్బులు తీసుకొని, రాజేందర్ నగర్ లోని ఉషోదయ హాస్పిటల్ కి ఆటోలో తరలించారు. హాస్పిటల్ లో అబార్షన్ చేయడానికి డాక్టర్ సరళ, డాక్టర్ ఫాతిమాలు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. డాక్టర్లను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నారు. వీరితో పాటు ఆటో డ్రైవర్ ను, డాక్యుమెంట్లను, కారును, మొబైల్ ఫోన్లను సీజ్ చేసి, ఇలాంటి చట్టవ్యతిరేకమైన పనులలో మధ్యవర్తిత్వం వహించిన వారు ఎవరెవరు ఉన్నారో వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తు లో ఇలాంటి చట్టవ్యతిరేకమైన పనులు చేయకుండా స్థానిక అన్ని హాస్పిటల్ లలో, కాలనిలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఇన్ స్పెక్టర్ జానకి రామ్ రెడ్డి, అడిషనల్ ఇన్ స్పెక్టర్  సైదులు తెలిపారు.

Related posts

10 నుండి 18 వరకు తాళ్లపాక శ్రీ చెన్నకేశవ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

ఆకౌంట్లో పడ్డ డబ్బులు వాపసు పోవు

Satyam NEWS

రిపబ్లిక్ డే వేడుకలకు అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు

Satyam NEWS

Leave a Comment