ఆస్తి తగాదాల్లో భాగంగా అక్క పెంచుకుంటున్న కుక్కను చంపాడు ఒక తమ్ముడు. దాంతో నాగరాజు అనే అతడిపై పోలీసులు 428 ఐపిసి సెక్షన్ కింద కేసుపెట్టి అరెస్టు చేసేశారు. ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాలాపేట లో నిన్న రాత్రి ఈ సంఘటన జరిగింది. ఆస్తికోసం నాగరాజు తన సొంత అక్క అయిన రమాదేవితో పోట్లాడాడు. ఆమె ఎంతకూ మాట వినలేదో ఏమో తెలియదు కానీ అక్కడే ఉన్నకుక్క మొడపై కాలేసి తొక్కి చంపేశాడు. తన తమ్ముడు ఆస్తి కొట్లాట లో భాగంగా అడ్డువచ్చిన కుక్కని మెడ పై కాలు పెట్టి చంపాడని అక్క రమాదేవి ou పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఆమె కంప్లైంట్ స్వీకరించిన పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి ఉదయాన్నే కుక్క డెడ్ బాడీ నీ నారాయణగూడ లోని ఒక ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పది రూపాయల కన్నా ఎక్కువ విలువ చేసే పెంపుడు కుక్కను లేదా ఇతర జంతువు ఎవరైనా ఏ విధంగానైనా చంపినా సెక్షన్ 428 ఐపిసి ప్రకారం శిక్షార్హులు. అదీ సంగతి.
previous post