25.2 C
Hyderabad
January 21, 2025 10: 53 AM
Slider కడప

పోలీసుల అదుపులో ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ

#raghavareddy

కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డిని పులివెందులలోని ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైకోర్టు ముందస్తు బెయిల్‌ తిరస్కరించడంతో పులివెందులలోని అతని ఇంటికి వెళ్లిన పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.  వైకాపా సోషల్‌ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డితో అసభ్యకర పోస్టులు పెట్టించారని రాఘవరెడ్డిపై అభియోగాలు ఉన్నాయి. నవంబరు 8న నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులో రాఘవరెడ్డి 20వ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసు దర్యాప్తు అధికారిగా పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్‌ వ్యవహరిస్తున్నారు. రాఘవరెడ్డిని పోలీసులు అరెస్టు చేస్తారనే ప్రచారంతో వైకాపా కార్యకర్తలు భారీగా పులివెందుల పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు.

Related posts

రైతాంగాన్ని దోచుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం

Satyam NEWS

ఈ నెల 7 నుంచి “జగనన్నే మా భవిష్యత్తు”..!

mamatha

తీరని అలసటపై తెలుగులో తొలి పుస్తకం

Satyam NEWS

Leave a Comment