36.2 C
Hyderabad
April 25, 2024 20: 15 PM
Slider ప్రత్యేకం

రోడ్లపై ఏ ఇబ్బంది ఉన్నా 100 కు కాల్ చేయండి

police

వెటర్నరీ వైద్యురాలు ప్రియాంకా రెడ్డి దారుణ హత్య ఘటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. మహిళలకు ఎక్కడ ఇబ్బంది కలిగినా, ఏ సమయంలో అయినా సరే పోలీసులు మీకు అండగా ఉంటారు అంటూ భరోసా ఇస్తున్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా 100 నెంబర్ కు డయల్ చేయాలని మహిళలకు సూచిస్తున్నారు.

 మహిళలకు భద్రత కరువైంది అన్న భావన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మహిళలకు రక్షణ కలిగించడానికి పోలీసులు అహర్నిశలు పనిచేస్తారని పోలీస్ శాఖ మహిళలకు భరోసా ఇస్తున్నది. ఈ విషయంలో డీజీపీ మహేందర్‌ రెడ్డి పలు సూచనలు చేశారు. రాత్రివేళ ప్రయాణాల్లో మహిళలు, వృద్ధులు తమ వాహనాలు చెడిపోయినప్పుడు, ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

రాత్రివేళల్లో ముప్పు పొంచి వుందనుకున్నప్పుడు 100 కు గానీ , 9490617111 నంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా షీ టీమ్స్‌ వాట్సాప్‌ నంబర్లు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్‌ చేశారు డీజీపీ మహేందర్ రెడ్డి. రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ కూడా మహిళల రక్షణ బాధ్యత పై పలు సూచనలు చేశారు. ప్రమాదంలో ఉన్న మహిళలు 100కు కాల్ చేసి సమాచారం అందించవచ్చని పేర్కొన్నారు.

షీ టీమ్స్‌ ల్యాండ్‌ లైన్‌ నంబరు 040-2785 2355, వాట్సాప్‌ నంబరు 9490616555కు సమాచారం ఇచ్చినా వారు వెంటనే సాయం అందిస్తారని తెలిపారు. టోల్‌ ఫ్రీ నంబర్లు కూడా అందుబాటులో ఉన్నాయని 112, 1090, 1091 నంబర్లకు కూడా అత్యవసర సమయంలో ఫోన్‌ చేసి సాయం కోరవచ్చు అని పోలీసులు పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లోనూ పోలీసులు మహిళలకు రోడ్లపైన రాత్రి వేళల్లో గాని, ఎలాంటి సందర్భంలో అయినా ఇబ్బంది తలెత్తితే, ఏదైనా ప్రమాదం పొంచి ఉందని భావిస్తే వెంటనే 100 కు డయల్ చేయాలని పోలీసులు కావాల్సిన సహాయాన్ని అందిస్తారని పోలీసులు చెప్పారు.

Related posts

కరోనాపై పోరాడండి: సెంట్రల్ వెస్టా ప్రాజెక్టు నిలిపేయండి

Satyam NEWS

నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే కూన

Bhavani

పేద విద్యార్ధుల సమక్షంలో టీడీపీ నేత ఆదితీ గజపతిరాజు బర్త్ డే

Satyam NEWS

Leave a Comment