రాజధాని గ్రామమైన మందడం శనివారం రణరంగాన్ని తలపించింది. గ్రామంలో శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న రైతులు, మహిళలపై పోలీసులు దాడి చేశారు. ర్యాలీని అడ్డుకునే ప్రయత్నంలో రైతులు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. మమ్మల్నే ఎదిరిస్తారా అంటూ పోలీసులు రైతులపై పిడిగుద్దులు కురిపించారు. మహిళలను జడలు పట్టుకుని లాగారు. వారిని ఈడ్చుకుంటూ వెళ్లి పోలీస్ వ్యాన్‌లో కుక్కారు. పోలీసులకు, రైతులకు జరిగిన తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి. ఒక వృద్ధురాలి చేయి విరిగింది. ఆమెను 108 వాహనంలో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు
previous post