39.2 C
Hyderabad
March 29, 2024 15: 55 PM
Slider విజయనగరం

విజయనగరంలో పోలీసులు అమరవీరుల సంస్మరణ ముగింపు

#deepika

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఆఖరి రోజైన 31న విజయనగరం జిల్లాలో విజయనగరం సబ్ డివిజన్ పోలీసు అధికారి అనిల్ పులిపాటి ఆఫీసు వద్ద కొత్తగా నిర్మించిన ఓపెన్ ఆడిటోరియాన్ని జిల్లా ఎస్పీ దీపికా ప్రారంభించారు.  ఓపెన్ ఆడిటోరియానికి శౌర్య అని పేరు పెట్టి అందులోనే పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించింది…ఎస్డీపీఓ.

ఈ సందర్భంగా ఎపీఎస్పీ, ఆర్మర్డ్ రిజర్వు చెందిన సిబ్బంది బ్యాండ్ తో..తమతమ విన్యాసాలను వచ్చిన అతిథులకు కనువిందు చేసారు.తొలుత ఓపెన్ ఆడీటోరియంను ప్రారంభించిన ఎస్పీ దీపికా… అనంతరం సాగిన పాటలు ,సంగీతం, నృత్య ప్రదర్శనలు ఆద్యంతం ఆలంకించారు. మధ్యలో తన గారాల పట్టి చంటి బిడ్డను ఎస్పీ ఎత్తుకుని కాస్సేపు కార్యక్రమాలను చూసారు.

పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా పోలీసు “బ్యాండు షో”

జిల్లాలో నిర్వహిస్తున్న పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా విజయనగరం డీఎస్పీ కార్యాలయ ప్రాంగణంలోని “శౌర్యం ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం” వద్ద ఆర్మ్డ్ రిజర్వు మరియు ఎపిఎస్పీ 5వ బెటాలియన్ పోలీసుల ఆధ్వర్యంలో సంయుక్తంగా “పోలీసు బ్యాండు డిస్ ప్లే” ను నిర్వహించారు. పోలీసు శాఖ నిర్వహించే విధులు, క్రమశిక్షణలో పోలీసు బ్యాండు కూడా భాగమే. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా పోలీసు బ్యాండు పని తీరు, నైపుణ్యాన్ని ప్రజలకు తెలియపర్చేందుకు బ్యాండు షో ను నిర్వహించారు.

ముఖ్య వ్యక్తుల గౌరవార్ధం పోలీసులు చేసే బ్యాండు ప్రక్రియకు ఒక విశిష్టమైన స్థానముంది. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, గవర్నరు వంటి ముఖ్యమైన వ్యక్తులు జిల్లాకు వచ్చినపుడు వారి గౌరవార్ధం బ్యాండు, బిగిల్ లో గౌరవించడం జరుగుతోంది. పోలీసులు అన్ని రంగాల్లోను తమ ప్రతిభను చూపుతూ, అత్యుత్తమ సంగీతాన్ని అందించి, ఆహ్వానితులను రంజింపజేసారు. పోలీసు బ్యాండు షో తోపాటు సంగీత పాఠశాల విద్యార్ధులు వీణ, వైలిన్లతో ప్రత్యేక దేశభక్తి గీతాలను పలికించారు.

అదే విధంగా హెూంగార్డు శ్రీనివాసరావు నేతృత్వంలో విద్యార్థినులు నృత్య ప్రదర్శనలు నిర్వహించి, ఆహ్వానితుల అభినందనలు పొందారు. విశాఖకు చెందిన శ్రీనివాసరావు దేశభక్తి గీతాలను ఆలపించగా, ఎఆర్ కానిస్టేబుల్ బలరాం పోలీసు అమరవీరుల త్యాగాలను కీర్తిస్తూ గీతాన్ని ఆలపించారు.

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు,సిబ్బంది, పోలీసు పిల్లలు, స్కూలు,కళాశాల విద్యార్ధులకు మూడు కేటగిరీలుగా విభజించి, వ్యాస రచన, వక్తృత్వ పోటీలను వేరు వేరుగా నిర్వహించారు. విజేతలుగా నిలిచిన వారికి జిల్లా ఎస్పీ ఎం.దీపిక, జేసీలు కిషోర్కు మార్, వెంకటరావు, ఓఎస్డీ సూర్యచంద్రరావు, మేయరు విజయలక్ష్మి, డిప్యూటీ మేయరు శ్రావణి ప్రోత్సాహక నగదు బహుమతులను అందజేసారు.

పోలీసు బ్యాండ్ మాస్టర్స్ కృష్ణారావు, సిహెచ్. కుమార రత్నం, కెవి రమణ, తవుడుల ఆధ్వర్యంలో ఏపీఎస్పీ మరియు ఆర్మ్డ్ రిజర్వు పోలీసులు అమరవీరులను స్మరించుకొంటూ, దేశభక్తిని చాటే చక్కని పాటలను వీనుల విందుగా వాయించి, ఆహ్వానితులను ఆహ్లాదపర్చారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్క మాండెంట్ డి.పద్మనాభరాజు, అసిస్టెంట్ కమాండెంట్ మురళీ కుమార్, డిఎస్పీలు అనిల్ పులిపాటి, పి.సౌమ్యలత, ఆర్.శ్రీనివాస రావు, ఏఆర్ డీఎస్పీ ఎల్.శేషాద్రి, డా. వేంకటేశ్వర రావు, పలువురు సీఐలు, ఆర్ ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, ఏపీఎస్పీ పోలీసు సిబ్బంది, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

రాక్షస రాజ్యం: టీడీపీ కార్యకర్తల్ని దారుణంగా హింసించిన వైసీపీ నేతలు

Satyam NEWS

మద్యం షాప్ ను వెంటనే తొలగించాలని ఎక్సైజ్ కమిషనర్ వినతిపత్రం

Satyam NEWS

విద్యా సంస్థలకు మూడు రోజుల పాటు సెలవులు

Satyam NEWS

Leave a Comment