బాసర జ్ఞాన సరస్వతీ దేవస్థానం లో జరగబోవు వసంత పంచమి ఉత్సవాల భద్రత మీద నిర్మల్ జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బైంసా ఎస్పి అవినాష్, ముధోల్ సీఐ మల్లేష్ ఎస్సై గణేష్ లతో కలిసి బాసర ఆలయాన్ని సందర్శించారు. అదే విధంగా స్థానిక పోలీసులకు తగు సూచనలు ఎస్పీ జానకి ఇచ్చారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా నిర్మల్ జిల్లా పోలీస్ తరఫున ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఉండవచ్చునని అన్నారు. అమ్మవారి జన్మదినం వసంత పంచమి సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రెవెన్యూ పోలీస్ పంచాయతీ సిబ్బంది అధికారుల సమన్వయంతో భక్తులు పోలీస్ శాఖకు సహకరించాలని ఒక ప్రకటనలో ఎస్పీ జానకి షర్మిల అన్నారు.
previous post