33.7 C
Hyderabad
February 13, 2025 20: 46 PM
Slider జాతీయం

కర్కశ పోలీసుల చేతుల్లో నలిగిపోయిన పిల్లాడు

police brutality

పోలీసులు ఒక పిల్లవాడి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నది. పిల్లాడిని పోలీసులు చెప్పులు, కర్రలతో కొడుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. దీంతో ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. దామో జిల్లాలోని కోత్వాలి పోలీస్ స్టేషన్లో ఈ ఘటన జరిగింది.

వీడియోలో ఇద్దరు పోలీసులు ఓ అమాయకపు బాలుడిని చెప్పులు, కర్రలతో చితకబాదుతున్నారు. ఎందుకు కొడుతున్నారో అనేది తెలియదు. కానీ కొట్టొద్దని ఎంత వేడుకున్నా వినకుండా పోలీసులు ఆ బాలుడిని నవ్వుతూ కొడుతూనే ఉన్నారు. ఆ బాలుడు  ఏడుస్తూ చివరకు పోలీసుల కాళ్ల మీద పడ్డాడు.

ఈ వీడియో కాస్త వైరల్  కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. బాలుడిని కొడుతున్న పోలీసులను గుర్తించారని, వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసు సూపరింటెండెంట్ వివేక్ సింగ్ తెలిపారు. వీడియోలో ఉన్నది మహేష్ యాదవ్ ,మనీష్ గాంధర్వ్ అనే  కానిస్టేబుళ్లుగా గుర్తించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కమల్ నాథ్ స్పందించారు. 

బాలుడిని కొడుతున్న ఘటనపై త్వరగా దర్యాప్తు చేయాలని పోలీసులను  ఆదేశించామని ట్వీట్ చేశారు. ఇటువంటి అమానవీయ సంఘటనలు మానవత్వంపై  మచ్చలాంటివని అన్నారు.

Related posts

కాంట్రవర్సీ: నాథూరాం గాడ్సే పై నాగబాబు వ్యాఖ్యలు

Satyam NEWS

పటిష్ట భద్రత తో ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ ఉప ఎన్నికలు

Satyam NEWS

‘ప్రత్యామ్నాయ ప్లాస్టిక్ బ్యానర్స్’ అంశంపై అవగాహన సదస్సు

mamatha

Leave a Comment