31.2 C
Hyderabad
April 19, 2024 04: 31 AM
Slider ఆదిలాబాద్

అత్యంత మారుమూల ప్రాంతానికి పోలీసుల చొరవతో రోడ్డు

#kumarambheempolice

అత్యంత మారుమూల ప్రాంతమైన తిర్యాని మండలం గుండాల గ్రామ రోడ్డు నిర్మాణంలో భాగస్వాములవ్వడం ఆనందదాయకమని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్ తెలిపారు. దీంతో గుండాల గ్రామానికి నవ స్వాతంత్రం  సిద్ధించిందని ఎస్పీ కే.సురేష్ కుమార్ వ్యాఖ్యానించారు. గిరిజనుల జీవితాల్లో  వెలుగులు నింపడమే  పోలీసుల అంతిమ లక్ష్యం అని ఆయన అన్నారు.

పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా  తిర్యాని మండలంలో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో  రోంపల్లి నుండి గుండాల వరకు 07 కిలోమీటర్ల వరకు ఏర్పాటు చేసిన రోడ్డును, జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా  ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కె.సురేష్ కుమార్ మాట్లాడుతూ పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా రొంపల్లి నుండి గుండాల వరకు ( సుమారు 07 కి.మి మేర)  రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. గుండాల గ్రామానికి నవ స్వాతంత్య్రం సిద్ధించిందని, గిరిజన జీవితాల్లో వెలుగు నింపడమే పోలీసుల అంతిమ లక్ష్యం అని ఎస్పీ తెలిపారు. ఈ రోడ్డు సౌకర్యం వల్ల గుండాల గ్రామానికి  విద్య,వైద్యం మెరుగుపడనుందని ఎస్పీ హర్షం వ్యక్తం చేశారు. పాఠశాల, కళాశాల  విద్యార్థులకు,ఆపదలో ఉన్న వారికీ అత్యవసర వైద్యం అందించే గోల్డెన్ అవర్ లోపు ఆసుపత్రి చేరేందుకు రోడ్డు సౌకర్యం అత్యంత ముఖ్యమని అన్నారు.

అనంతరం ఎమ్మెల్యే ఆత్రం సక్కు జెడ్పి చైర్ పర్సన్ కోవలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో అత్యంత మారుమూల ప్రాంతమైన గుండాల గ్రామానికి రహదారి నిర్మించే బాధ్యత జిల్లా ఎస్పీతీసుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ రోడ్డు నిర్మాణ పనుల్లో భాగస్వాములు అవుతున్న ట్రాక్టర్స్ యూనియన్,సింగరేణి యాజమాన్యం,గుండాల గ్రామస్తులకు అభినందనలు తెలియజేశారు. కొత్తగా ఏర్పాటు అయిన రోడ్డు సౌకర్యం వల్ల గుండాల గ్రామస్తులకు ఎంతో మేలు కలుగుతుందని తెలిపారు. ఎన్నో సంవత్సరాల నుండి రాకపోకలకు అవస్థలు పడుతున్న గుండాల గ్రామస్తులు పోలీసు ద్వారా ,ఈ రోడ్డు నిర్మాణం వల్ల గ్రామస్తుల జీవితాలు మెరుగుపడనున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా తార్ రోడ్ వేసే ప్రయత్నం కూడా చేస్తామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు.

Related posts

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి ఆకస్మిక తనిఖీ

Satyam NEWS

శ్రీకాకుళం లో ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు

Satyam NEWS

పోలీసు బాస్ ఆదేశాలతో ఖాకీలు విజుబుల్ పోలీసింగ్…!

Satyam NEWS

Leave a Comment