39.2 C
Hyderabad
April 18, 2024 17: 57 PM
Slider విజయనగరం

విజయనగరంలో లాక్డ్ హౌసెస్ పై నిఘాకు శ్రీకారం

#vijayanagarampolice

రాబోతున్న కరోనా రాత్రి కర్ఫ్యూ, సంక్రాంతి సెలవలకు ఎక్కువ మంది సొంత ఊళ్లకు వెళ్లడం నేపథ్యంలో విజయనగరం పోలీసులు రాత్రి గస్తీ తీవ్ర తరం చేశారు. విజయనగరం జిల్లా ఎస్పీ దీపిక  ఆదేశాలతో జిల్లా పోలీసులు రాత్రి బీటు, పెట్రోలింగ్ లో సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు.

ఇందులో భాగంగా  విజయనగరం వన్ టౌన్, టూటౌన్, రూరల్ దిశా మహిళా పీఎస్ పరిధిలో రాత్రి గస్తీ, పెట్రోలింగ్ నిర్వహించే పోలీసు సిబ్బంది, అధికారులు నగరంలో ప్రజలెక్కువగా సంచరించే ప్రాంతమైన బాలాజీ జంక్షన్ వద్ద చేరగా, గస్తీ సిబ్బందికి రాత్రి  నిర్వర్తించే విధులు గురించి, లాక్డ్ హౌసెస్ పై నిఘా పెట్టాలని, బీట్ పరిధిలోని హిస్టరీ షీటు కలిగిన వ్యక్తులను తప్పనిసరిగా తనిఖీ చేయాలని నిర్ణయించారు.

గస్తీ ప్రాంతాల్లో విజిల్స్ వేస్తూ, అప్రమత్తంగా తిరగాలని, పండుగ రోజులు కావడం వలన చాలామంది బయట ప్రాంతాలకు వెళ్ళిపోయినందున, బీటు పరిధిలోని తాళాలు వేసి ఉన్న ఇండ్లపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలని సిబ్బంది కి తగు జాగ్రత్తలు ఇచ్చే పనిలో పడింది పోలీసు శాఖ. ఈ మేరకు ఎస్పీ ఆదేశాలతో ఏఎస్పీ అనిల్.. ఎటువంటి నేరాలు జరగకుండా చూడాలని, రాత్రి విధులు నిర్వహించే వారు ప్రోపర్ యూనిఫాం ధరించాలని ఆదేశించారు.  రాత్రి విధులు నిర్వహించే పోలీసు సిబ్బందిని, తనిఖీలు నిర్వహించే పోలీసు అధికారులను ఆదేశించారు.

బ్రీఫింగు అనంతరం వివిధ ప్రాంతాలకు వెళ్ళే బీటు సిబ్బంది, అధికారులు నగరంలోని నలుమూలలకు పంపడం జరిగింది.ఈ బ్రీఫింగ్ కార్యక్రమంలో టూటౌన్ సీఐ లక్ష్మణరావు, రూరల్ సీఐ మంగవేణి, ఎస్ఐలు దుర్గా ప్రసాద్, సాగర్ బాబు, విజయకుమార్, రాజేష్, దినకర్,  ఈశ్వరరావు, విక్రమరావు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఎం.భరత్ కుమార్, సత్యం న్యూస్.నెట్, విజయనగరం

Related posts

క్షౌర వృత్తిలోకి కార్పొరేట్లు రావడం పై నిరసన

Satyam NEWS

మింట్ కాంపౌండ్ లో మిస్ ఫైర్: ఒకరి మృతి

Bhavani

20వ తేదీన కొప్పుల వెలమ వనభోజన కార్యక్రమం

Bhavani

Leave a Comment