32.2 C
Hyderabad
March 28, 2024 22: 34 PM
Slider ప్రత్యేకం

తాగి వాహనం నడిపినా పోలీసులు వాహనాన్ని ఇక సీజ్ చేయలేరు

#High Court

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇప్పటి వరకూ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారి నుంచి పోలీసులు వాహనాలను సీజ్ చేస్తున్నారు. వాటిని ఆ తర్వాత ఫైన్ కట్టి విడిపించుకోవాల్సి వస్తున్నది. దీనికి సంబంధించిన కేసులను విచారించిన తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల పై హైకోర్టులో 40 రిట్ పిటిషన్లు దాఖలు అయ్యాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ లో డ్రైవర్ తాగి పట్టుబడితే వాహనాన్ని  వాహన దారుని సన్నిహితులకు సమాచారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అంతే తప్ప వాహనాన్ని సీజ్ చేసే వీలులేదని స్పష్టం చేసింది.

కొన్ని తప్పనిసరి సందర్భాల్లో  వాహనాన్ని  పోలీస్ కస్టడీకి తీసుకోవచ్చునని హైకోర్టు వెల్లడించింది. పోలీస్ కస్టడీలోకి తీసుకున్న వాహనాన్ని  వాహనం ఆర్సీ చూపిస్తే ఆ వాహనాన్ని రీలీజ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. అంతే కానీ మోటార్ వెకిల్ యాక్ట్ ప్రకారం వాహనాన్ని సీజ్ చేసే అధికారం ఎవ్వరికీ లేదని హైకోర్టు స్పష్టం చేసింది.

Related posts

వల్లంపూడి స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన విశాఖ డీఐజీ

Satyam NEWS

నల్లపోచమ్మ ఆలయంలో ఘనంగా బోనాలు

Satyam NEWS

టీడీపీతో పొత్తుకు నో అంటున్న కమలనాథులు

Satyam NEWS

Leave a Comment