25.2 C
Hyderabad
October 10, 2024 20: 41 PM
Slider ఆంధ్రప్రదేశ్

పోలీసుల అదుపులో మావోయిస్ట్ అ్రగనేత భార్య

moist

విశాఖపట్నం జిల్లాలోని ఎజెన్సీ ప్రాంతంలో ఇటీవల భారీ ఎన్‌కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే కొందరు ప్రాణాలతో పట్టుబడినట్లు కూడా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై క్లారిటీ వచ్చింది. మావోయిస్టుల అగ్రనేత చలపతి భార్య అరుణ పోలీసులు అదుపులో ఉన్నారు. ఏజెన్సీలో జరిగిన ఎదురుకాల్పుల్లో అరుణ గాయపడ్డారు. ఈ క్రమంలో గాయాలతో ఉన్న అరుణను పోలీసులు అదుపులోకి తీసుకుని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. చికిత్స పూర్తయిన అనంతరం అరుణను మరింత విచారిస్తామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. కాగా ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. బురదకోట విలేజ్ లో గాయాలతో స్పెషల్ పార్టీకి మావోయిస్ట్ నేత సాకె కళావతి అలియాస్  భవాని పట్టుబడ్డారు. ఆమె మావోయిస్ట్ ఏరియా కమిటి మెంబర్ గా పనిచేస్తున్నారు. కళావతి 20 ఏళ్లుగా మావో ఉద్యమంలో వివిధ విభాగాల్లో పనిచేశారు. మావోయిస్ట్ స్టేట్ జోన్ కమిటి మెంబర్ పెద్దన్న అలియాస్ జగన్ భార్య ఈ కళావతి. విశాఖ మన్యంలో కూంబింగ్ ఇంకా కొనసాగుతూనే ఉన్నది

Related posts

భక్తులతో దురుసుగా ఏ ఒక్క‌రూ ప్రవర్తించవద్దు…!

Satyam NEWS

రాజకీయ విద్వేషంపై రాష్ట్రపతికి ఫిర్యాదు

Satyam NEWS

ఆన్ డ్యూటీ:బస్సు లోనే గుండె పోటుతో కండక్టర్ మృతి

Satyam NEWS

Leave a Comment