40.2 C
Hyderabad
April 19, 2024 16: 53 PM
Slider ముఖ్యంశాలు

మీడియాలో అసభ్య ఆరోపణలు చేసిన వారిపై కేసు

#Anamchinni

ఆరు నెలల క్రితం సీనియర్ పరిశోధన పాత్రికేయులు, జేఎస్సెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనంచిన్ని వెంకటేశ్వరరావు పై నిరాధార ఆరోపణలు చేస్తూ సంకసర్ల సువర్ణ అనే మహిళ సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సదరు కేసుపై పోలీసులు నిర్ణయం తీసుకోనున్నారు.. కాగా తాను చేసిన ఆరోపణలను, వాస్తవాలు గా చిత్రీకరిస్తూ, అసభ్య పదజాలంతో మళ్ళీ పోస్టులు పెట్టడమే కాకుండా తన ఫ్రెండ్స్ అయిన దేవరాజ్ తో కూడా ఆమె పోస్టింగ్స్ పెట్టించారు.

దీనికి తోడు హ్యూమన్ రైట్స్ పేరుతో చెలామణి అవుతున్న మరో వ్యక్తి గౌస్ పాషా, ఓ పక్ష పత్రికకు ఎడిటర్ గా చెప్పుకుంటూన్న శివ పట్నాయక్ లు, ఆనంచిన్ని వెంకటేశ్వర రావు పై అనుచిత వ్యాఖ్యలు చేయడం, అసభ్యపదజాలంతో పోస్టింగ్స్ పెట్టడం, కేరెక్టర్ ని తక్కువ చేసే విధంగా స్టేట్మెంట్ ఇవ్వడం పై ఆనంచిన్ని మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

కోర్టు పరిధిలో ఉన్న అంశాలను తిరిగి పోస్ట్ చేయడం పట్ల జేఎస్సెస్ సభ్యులు మండి పడుతున్నారు. జర్నలిస్ట్ లపై దాడులు చేయించడం, ప్రేరేపిత కేసులు పెట్టించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడటమే కాకుండా, వాటిని ఉపమానిస్తూ, అవమానించి గోబెల్స్ ప్రచారం చేసేవాళ్ళను సహించేది లేదని హెచ్చరించారు.

ఫిర్యాదు తీసుకున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ దర్యాప్తు చేస్తామన్నారు. కోర్టు పనివేళల అనుమతి లభించాక కోర్టుకు సమర్పిస్తామని తెలిపారు. భవిష్యత్ లో పాత పోస్టింగ్స్ ని తిరగ తోడినా, మళ్ళీ పోస్ట్ చేసే ప్రయత్నం చేసినా, కోర్టు పరిధిలో ఉన్న కేసుల గురించి కించపరిచే విధంగా పోస్టులు పెట్టినా కేసుల పాలు కావడం ఖాయమని జేఎస్సెస్ హెచ్చరిస్తోంది. ఫిర్యాదులో పేర్కొన్న సంకసర్ల సువర్ణ, గౌస్ పాషా, దేవరాజ్, శివ పట్నాయక్ లపై విచారణ చేస్తున్నట్లు మంచిర్యాల సిఐ ముత్తులింగం తెలిపారు.

Related posts

శాంతి ప్రతిజ్ఞ!

Satyam NEWS

[2022] Authentic Japan Hokkaido Weight Loss Pills How Much Weight Will Water Pills Help Me Lose

Bhavani

ఆల్ ద బెస్ట్: వీణా వీణీలకు శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్యే మాగంటి

Satyam NEWS

Leave a Comment