38.2 C
Hyderabad
April 25, 2024 11: 10 AM
Slider అనంతపురం

అమరావతి సాధన సమితి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

#AllParty

అమరావతి సాధన సమితి ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. అమరావతి  రాజధాని సాధన కోసం చేపట్టిన ఆందోళన కార్యక్రమం 300 రోజులకు చేరుకున్న సందర్భంగా  అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ యాక్షన్ కమిటీ సంఘీభావ ర్యాలీ చేపట్టింది.

అయితే కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని  సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు అడ్డగించారు. అనంతరం వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.

ఈ సందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్  మల్లికార్జున, సిపిఐ తాలూకా కార్యదర్శి గోపాల్, అమరావతి జేఏసీ కన్వీనర్ తిరుపతి రావు, అమ్ ఆద్మీ నాయకుడు వరప్రసాద్ , మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి తదితరులు ప్రసంగించారు.

ఒకసారి అధికారం ఇవ్వమంటే రాష్ట్ర ప్రజలు ఎంతో నమ్మకంతో అధికారాన్ని అప్పగిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ,రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందరూ అంగీకరించిన అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేసి ప్రాంతీయ అసమానతలను రెచ్చగొడుతూ, 3 రాజధానుల నిర్ణయం పునర్ సమీక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

ఉద్యమాన్ని అణచివేసేందుకు పోలీసుల చర్యలను వారు నిరసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కార్యదర్శి ప్రియాంక శివ శంకర్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రభుత్వం రియల్ ఎస్టెట్ వ్యాపారం చేయడం సిగ్గుచేటు

Satyam NEWS

వైభవంగా విజయనగరం పైడతల్లి అమ్మవారి ఉయ్యాల కంబాల ఉత్సవం

Satyam NEWS

భైంసా అల్లర్ల బాధితులను పరామర్శించిన కేంద్ర మంత్రి

Satyam NEWS

Leave a Comment