36.2 C
Hyderabad
April 23, 2024 19: 37 PM
Slider మహబూబ్ నగర్

లాక్ డౌన్ లో పెళ్లి చేసుకున్న వారిపై పోలీసు కేసు

#marriage

వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈర్ల తాండాలో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి   వంద మందితో పెండ్లి చేసి,పెళ్ళి ఊరేగింపు నిర్వహించిన పెళ్ళి నిర్వాహకుడిపై, డి.జె సౌండ్ ను అద్దెకు ఇచ్చిన  వ్యక్తి పై కేసు నమోదు చేశామని ఘనపురం ఎస్.ఐ. వెంకటేష్ గౌడ్ విలేకరులకు తెలిపారు.

ఒకవైపు కోవిడ్  విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన  ఈర్ల తండాకు చెందిన వ్యక్తి తన కూతురు వివాహం చేసిన అనంతరం  తెల్లవారుజామున డి.జె. సౌండ్ సిస్టమ్ తో ఊరేగింపు నిర్వహించి,డ్యాన్స్ చేశారని ఆయన తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి సుమారు 100 మందితో తన కూతురు పెళ్లి లో డిజె సౌండ్ తో డాన్సులతో ఊరేగింపు చేస్తుండగా పోలీసులు అక్కడికి చేరుకున్నారన్నారు.

డిజె సౌండ్ యజమానిపై, ఈర్ల తండాకు చెందిన  పెళ్ళి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశామని చెప్పారు. ఘనపురం మండలంలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.   కోవిడ్ మహమ్మారిని నివారించడంలో అందరూ సహకరించాలని ఆయన ప్రజలను కోరారు. అతి తక్కువ మందితో శుభకార్యాలు జరుపుకోవాలని, లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని తెలిపారు. పోలీసులకు పూర్తి సహకారాలు అందించి లాక్ డౌన్ లో ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆయన ప్రజలను కోరారు.నిబంధనలు ఉల్లంఘించే వారి గురించి తనకు సెల్ నంబర్ 9440795728 పోన్ చేయాలని ఆయన కోరారు.

Related posts

తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో విశ్వకర్మ ఆరాధన

Satyam NEWS

ముగ్గురు స్మ‌గ్ల‌ర్లు అరెస్ట్‌.. 10 ఎర్ర చంద‌నం దుంగ‌లు స్వాధీనం

Sub Editor

ప్రైవేటు టీచర్ లను ప్రభుత్వం ఆదుకోవాలి

Satyam NEWS

Leave a Comment