39.2 C
Hyderabad
April 23, 2024 17: 55 PM
Slider అనంతపురం

స్కాలర్ షిప్ అక్రమాలపై ఎఫ్ ఐ ఆర్ నమోదు

#ananthapur

ఎస్ ఎస్ బి ఎన్ కళాశాల యాజమాన్యానికి మరో షాక్ తగిలింది. విద్యార్థులకు చెందాల్సిన ప్రభుత్వ స్కాలర్ షిప్ ల మొత్తాన్ని ఇతర బ్యాంకు ఖాతాకు మళ్ళించారు. ప్రముఖ న్యాయవాది, అనంతపురం డిస్టిక్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మాజీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యడు పి జి విఠల్ ఈ అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

అందుకు స్పందించిన న్యాయమూర్తి దర్యాప్తు జరపాలని పోలీసులను ఆదేశించారు. దీనిపై పట్టణ టూ టౌన్ పోలీసులు నమో చేశారు. విద్యార్థులకు సంబంధించిన రూ.43 లక్షల 39వేల 065 రూపాయలను పక్కదారి పట్టించారని న్యాయవాది విఠల్ ఫిర్యాదు చేశారు.

ఇదిలా ఉండగా న్యాయస్థానం ఆదేశం మేరకు 2 టౌన్ పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. A1 గా ఎస్ ఎస్ బి ఎన్ కళాశాల కరస్పాండెంట్ లక్ష్మీనారాయణ రెడ్డి, A2 గా ఎస్ ఎస్ బి ఎన్ కళాశాల కార్యదర్శి కె. నిర్మలమ్మ, A3 గా అదే కళాశాల ప్రెసిడెంట్ పి వెంకట రమణారెడ్డి. A4 గా ఎస్ ఎస్ బి ఎన్ కళాశాల ఉపాధ్యక్షుడు పి రమేష్ బాబు, A5 గా అనంతపురం డిస్టిక్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మాజీ ట్రెజరర్ ఎస్. రంగయ్య లను పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చారు.

గతంలో ఉన్న కేసుతో బాటు ఇప్పుడు మరో కేసు కళాశాల యాజమాన్యం పై నమోదు కావడం చర్చనీయాంశమైంది. ఈ కేసుల నమోదు ద్వారా ఎస్ ఎస్ బి ఎన్ కళాశాలకు ఉన్న ప్రతిష్ట ఇలాంటి వారి వల్ల దెబ్బతింటోoదని పూర్వపు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

Related posts

ఈద్గాకు ప్రారంభోత్సవం చేసిన మంత్రి ఆర్.కె.రోజా

Satyam NEWS

మైనారిటీ అమ్మాయిలపై అత్యాచారం చేసేవారిని ఎన్ కౌంటర్ చేయాలి

Satyam NEWS

శంభో శివ శంభో: వేడుకగా అత్తిరాల తిరునాళ్ళు

Satyam NEWS

Leave a Comment