32.2 C
Hyderabad
April 20, 2024 19: 34 PM
Slider ముఖ్యంశాలు

టీవీ5 ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్ మూర్తిపై కేసు నమోదు

#TV5Murthy

కరోనా వైరస్ పై ప్రాణాలకు తెగించి పోరాటం జరుపుతున్న వైద్యుల నైతిక స్థయిర్యం దెబ్బతినే విధంగా వార్తలు ప్రసారం చేసినందుకు టీవీ5 ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్ మూర్తిపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారని తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె ఎస్ జవహర్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం.

 కరోనా వైరస్ చికిత్సలో నిమగ్నమై ఉన్న వైద్యులకు ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించడం లేదని నర్సిపట్నం కు చెందిన ఏరియా ఆసుపత్రి ఎనస్తటిస్టు సుధాకర్ రావు ఆరోపించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నుంచి ఎన్95 మాస్కులు రావడం లేదని ఆయన చెప్పిన తర్వాత ఆయనను ఏప్రిల్ 8న ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఆయనపై క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు. డాక్టర్ సుధాకర్ రావును ఇంటర్వ్యూ చేయడం, టీవీ 5లో వ్యాఖ్యానాలు చేయడం తరచూ కరోనాపై వైద్యుల నైతిక స్థయిర్యాన్ని దెబ్బ తీసే విధంగా ప్రసారాలు చేయడం తదితర కారణాలతో పోలీసులు మూర్తిపై కేసు నమోదు చేశారని అంటున్నారు. తదుపరి చర్యలకు మూడు పోలీసు బృందాలు సిద్ధం అవుతున్నట్లు తెలిసింది.

Related posts

కూన శ్రీశైలం గౌడ్ అరెస్ట్

Bhavani

ఇస్రో నుంచి విద్యార్ధులు సృష్టించిన ‘ఆజాది శాట్’ ప్రయోగం

Satyam NEWS

నోబుల్ కాజ్: ప్లాస్టిక్ రహితంగా మేడారం జాత‌ర‌

Satyam NEWS

1 comment

PUTTU GEMINI April 30, 2020 at 1:32 PM

Am big follower of YSR and now YSRCP but this is not good for our government. People will understand government is taking revenge on others who’s questioning them. It gives bad impact on our government sir. Please don’t do anything like this

Reply

Leave a Comment