అరాచకాలు, అకృత్యాలకు అలవాటు పడ్డ తెలుగుదేశం నాయకులు పాపం ఇప్పుడు కేసుల వలలో చిక్కిపరారీ అవుతున్నారు. అసెంబ్లీ స్పీకర్ గా ఉండి ఫర్నీచర్ తీసుకువెళ్లిన కోడెల శివప్రసాదరావు పై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అంతకు ముందు కోడెల శివప్రసాదరావు కుమారుడు, కుమార్తె లపై బలవంతపు వసూళ్ల కేసులు నమోదు అయ్యాయి. యరపతినేని శ్రీనివాసరావుపై సిబిఐ కేసు ఉంది. కూన రవికుమార్ పరారీలో ఉన్నాడు. ఇలా ఒక్కొక్కరూ పరారీ అవుతుందటే తాజాగా దెందులూరు మాజీ ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ పరారీ అయ్యాడు. చింతమనేనిని పట్టుకోవటం కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. పినకడిమి శివారులో ఎడ్లబళ్లపై ఇసుక తీసుకువెళుతున్న దళితులను అడ్డుకుని, వారిని కులం పేరుతో దూషించారని దళితులు నిన్న ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో వైసీపీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ఇక్కడ దళితులు చేస్తున్న ఆందోళనకు ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి మద్దతునిచ్చారు. చింతమనేనిపై దళితులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు పెట్టటంతో ఏలూరు డీఎస్పీ దిలీప్ కిరణ్ విచారణ చేపట్టారు. చింతమనేనితో పాటు ఆయన అనుచరులపైనా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. చింతమనేనిపై ఇది రెండో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు. చింతమనేని, ఆయన అనుచరులు కొట్టారని రాచేటి జాన్ అనే హమాలీ నాయకుడు గతంలో ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో చింతమనేనిని అరెస్ట్ చెయ్యాలని పోలీసులు చూస్తున్నారు. ఈ కేసుల నేపధ్యంలో చింతమనేనిని పట్టుకోవటం కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి.
previous post
next post