మైనర్ బాలికపై అత్యాచారం చేసి పరారైన వాడు దొరికాడు. కడప జిల్లా రాజంపేట మండలం తాళ్ళపాక లో ఈనెల 4వ తేదిన 5 సంవత్సరాల మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన జవ్వాది వెంకటేశ్ (25) అనే యువకుడు అత్యాచారం చేసి పరారయ్యాడు. ఆ రోజు వీధిలో ఆడుకుంటున్న బాలికకు పాలు తాగిస్తానని జవ్వాది వెంకటేశ్ తన ఇంటికి తీసుకెళ్లాడు.
అక్కడ బాలికకు మాయ మాటలు చెప్పి అత్యాచారం చేస్తుండగా, బాలిక అవ్వ కొత్త పల్లె సుబ్బమ్మ గమనించింది. సుబ్బమ్మ స్థానికులను పిలవడంతో వెంకటేశ్ ను పట్టుకుని దేహ శుద్ధి చేశారు. నేటి ఉదయం పట్టణం లోని యల్లాగడ్డ లో రాముని గుడి వద్ద వెంకటేశ్ తచ్చాడుతుండగా పోలీసుల కంటపడ్డాడు.
వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు జవ్వాది వెంకటేశ్ ను మీడియా ఎదుట హాజరు పరిచారు. బాలిక తల్లి ఆది లక్షుమ్మ, అవ్వ సుబ్బమ్మ లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితుడిని కోర్టుకు హాజరు పరచనున్నట్టు మీడియా సమావేశంలో డిఎస్పీ నారాయణ స్వామి రెడ్డి తెలిపారు.