31.7 C
Hyderabad
April 19, 2024 00: 48 AM
Slider ఆదిలాబాద్

కమ్యూనికేషన్ విభాగం పోలీస్ శాఖలో అత్యంత కీలకం

#police communication

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కమ్యూనికేషన్ వ్యవస్థ జిల్లాలో అత్యంత పటిష్టంగా పనిచేస్తుందని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర పేర్కొన్నారు. మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎస్సై పదోన్నతి పొందిన వి. గంగాసాగర్  జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రానికి చెందిన  గంగాసాగర్ హైదరాబాద్ ఐటిఐ కళాశాలలో డిగ్రీ పట్టభద్రులై 1991 సంవత్సరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కమ్యూనికేషన్ విభాగం కానిస్టేబుల్ హోదాలో ఎంపికైనారు.

19 సంవత్సరాల పాటు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో పనిచేసి 2011 సంవత్సరంలో హెడ్ కానిస్టేబుల్, 2018 సంవత్సరంలో ఏఎస్ఐగా పదోన్నతి ఉంది గత రెండు సంవత్సరాలుగా అదిలాబాద్ కమ్యూనికేషన్ విభాగం ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. ఈనెల 14న కమ్యూనికేషన్ విభాగం హైదరాబాద్ అదనపు డీజీపీ రవి గుప్త జారీ చేసిన 16 మందికు కమ్యూనికేషన్ ఎస్సై పదోన్నతి జాబితాలో సీనియార్టీ ప్రకారం గంగాసాగర్ కు ఎస్సై పదోన్నతి కల్పించారు. త్వరలో ఖాళీలనుసరంగా జిల్లా ఇన్చార్జిగా కేటాయిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

తన సర్వీస్ లో మూడు పదోన్నతులు రావడంతో ఎస్సై గంగాసాగర్ సంతోషం వ్యక్తం చేశారు, ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సమర్థంగా పోలీసు శాఖలో పనిచేసిన వారికి తప్పనిసరిగా గుర్తింపు వస్తుందన్నారు, ఇటీవలే కమ్యూనికేషన్ వినియోగం భారీగా పెరిగిందని, భారీ బందోబస్తు సమయంలో కమ్యూనికేషన్ ద్వారానే విధి నిర్వహణలో ఉన్న పోలీసులు పరస్పర సమాచారం అందుకునే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు, బహిరంగ సభలో ట్రాఫిక్ క్రమబద్దీకరించడం,రాత్రి సమయంలో పెట్రోలింగ్, గస్తీ నిర్వహిస్తున్న పోలీసులకు కమ్యూనికేషన్ హ్యాండ్ సెట్ ద్వారానే పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు,

జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు కంట్రోల్ రూమ్ లో కమ్యూనికేషన్ తోనే అనుసంధానం చేసినట్లు తెలిపారు, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం రాష్ట్ర డిజిపి డాక్టర్ ఎం మహేందర్ రెడ్డి నేతృత్వంలో కమ్యూనికేషన్ విభాగంను అత్యాధునికంగా తీర్చిదిద్దారని, ఇటీవలే నిర్వహిస్తున్న వీడియో, టెలీ కాన్ఫరెన్స్, అందుబాటులోకి రావడం కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా సాధ్యమైందని తెలిపారు,

అదనపు ఎస్పీ ఎస్. శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జి. మల్లేష్, ఎస్సై సయ్యద్ అన్వర్ ఉల్ హక్,  పోలీస్ కార్యాలయం పరిపాలనాధికారి మొహమ్మద్ యూనుస్ అలీ,క్యాంపు కార్యనిర్వాహణాధికారి దుర్గం శ్రీనివాస్, తదితరులు అభినందనలు తెలియజేశారు.

Related posts

చిలుకూరులో నిరాడంబరంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

రంజాన్ పండుగరోజు కూడా పరీక్ష నిర్వహించడమేమిటి?

Satyam NEWS

1000 మంది జంటల వికృత రాసలీలలు

Sub Editor

Leave a Comment