జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పైనా, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపైనా బూతు పురాణం విప్పిన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిపై జనసేన పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసభ్యంగా మాట్లాడిన ద్వారంపూడిపై కేసు నమోదు చేయాలని వారు కోరారు. రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ జరుగుతున్న ఆందోళనపై ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడుతూ చంద్రబాబు, పవన్‌పై బూతులు మాట్లాడిన విషయం తెలిసిందే. చంద్రబాబునాయుడిని ల కారంతో ప్రారంభమయ్యే పదాన్ని వాడిన ద్వారంపూడి, పవన్ కల్యాణ్ ను ఒక ప్యాకేజీ స్టారని ఆరోపించారు. చంద్రబాబు చెప్పు చేతల్లో నడిచే ఆయన కూడా ఒక నాయకుడేనా? అని ప్రశ్నించారు. అంతేకాదు బూతులు మాట్లాడారు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన మంగళగిరి జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
previous post