28.7 C
Hyderabad
April 24, 2024 06: 36 AM
Slider మహబూబ్ నగర్

వనపర్తిలో గంజాయి, మద్యం, పొగ సేవిస్తున్న వారిపై వల

#WanaparthySI

యువత చెడు వ్యసనాలకు,మత్తుకు బానిస కావద్దని పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ద వహించాలని వనపర్తి టౌన్ ఎస్సై వెంకటేష్ గౌడ్ సూచించారు.

శనివారం పట్టణంలోని వివిధ ప్రాంతాలలో స్మోకింగ్,మద్యం,గంజాయి సేవిస్తున్న పలువురి యువకులను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

వారి తల్లిదండ్రులను పిలిపించి యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులు సంపాదన పైనే కాకుండా, పిల్లలు చదువులతో పాటు,వాళ్ళు చేసే పనులపై దృష్టి సారించాలని సూచించారు.

కష్టపడి తల్లిదండ్రులు పని చేసి ఉన్నత చదువులకు పంపిస్తే కష్టపడి చదివి వారికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

మత్తుకు బానిస అయితే యువత జీవితాలు నాశనం అవుతాయని తెలిపారు.

ఉన్నత చదువులు చదువుకొని పుట్టిన ఉరికి,తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురవడంతో పాటు పది మందికి సాయం చేసే స్థాయికి ఎదగాలని సూచించారు.

చిన్న వయసులోనే చేడు వ్యసనాలకు బానిసైయితే వాటి నుంచి బయట పడటం కష్టమన్నారు.ఇంకో సారి పట్టుబడితే కేసులు నమోదు చేయడంతో పాటు రిమాండ్ కు పంపిస్తామని హెచ్చరించారు.

యువకులకు,తల్లిదండ్రులకు  ఎస్సై వెంకటేష్ గౌడ్ కౌన్సెలింగ్ ఇచ్చారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

14, 15వ తేదీల్లో అసిస్టెంట్ ఇంజ‌నీర్ల‌కు ప్ర‌త్యేక పరీక్ష

Satyam NEWS

కొల్లాపూర్ లో ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా

Satyam NEWS

శ్రీ రేణుక మాత ఎల్లమ్మ మొదటి వార్షికోత్సవం

Satyam NEWS

Leave a Comment