వృత్తి లో అనుక్షణం ఎన్నో ఒత్తిళ్లకు కింది స్థాయి నుంచీ పై స్థాయి అధికారి వరకు ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొంటామని, అందుకు ఉపశమనం లాంటిదీ ఈ స్పోర్ట్స్ మీట్ అని విశాఖ పోలీస్ రేంజ్ డీఐజీ గోపీనాధ్ జెట్టి అన్నారు. విజయనగరం పోలీస్ బ్యారెక్స్ లో 31వ వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ను డీఐజీ ఫ్లేగ్ ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది వృత్తి లో ఫిజికల్ ఫిట్ నెస్ కూడా అత్యంత అవసరమన్నారు. ఇటు వృత్తి లోను అటు ఫ్యామిలీ లోనూ వస్తున్న ఒత్తిళ్లను అధిగమించడానికి ఈ స్పోర్ట్స్ మీట్ దోహదపడతాయని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాద్ జెట్టి అన్నారు.
అంతకు ముందు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ మన ఆరోగ్యం మంచిగా ఉండేలా మనమే చూసుకోవాలని అన్నారు. ఈ స్పోర్ట్స్ మీట్ మన హెల్త్ కు ఉపయోగపడుతున్నారు. విధుల్లో వస్తున్న ఒత్తిళ్లను అధిగమించడానికి మెంటల్ ఎక్సరసైజ్ పాటు ఫిజికల్ ఎక్సరసైజ్ ఎంతో అవసరమని ఎస్పీ అన్నారు. అందంకోసం తమ శాఖ నిర్వహిస్తున్న ఈ స్పోర్ట్స్ మీట్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు విజయనగరం జిల్లా పోలీస్ బాస్. స్పోర్ట్స్ మీట్ ప్రారంభ సూచకంగా డీఐజీ, ఎస్పీలు శాంతి కి చిహ్నం గా పావురాలను గాలిలో కి వదిలారు. అనంతరం మైదానంలో ముందు రన్ ను గాలిలో గన్ తో ఒక రౌండ్ పేల్చి ప్రారంభించారు డీఐజీ గోపీనాధ్, ఎస్పీ వకుల్ జిందల్ లు.