27.7 C
Hyderabad
April 24, 2024 07: 53 AM
Slider శ్రీకాకుళం

సాయుధ దళంలో పోలీసుల‌కు త‌ప్ప‌ని తిప్ప‌లు

police

శ్రీకాకుళం జిల్లా ఏచర్ల మండలంలో గల సాయుధ దళంలో 10 సాయుధ దళాలున్నాయి. ఈ 10 సాయుధ దళాల్లో పదిమంది హెడ్ కానిస్టేబుల్ ర్యాంకు గల రైటర్లు వారు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో ఒకటి లేక రెండు సంవత్సరాల‌కు వీరిని ఒక దళము నుంచి వేరొక దళంలో ఉద్యోగము మారుస్తూ ఉంటారు. కానీ శ్రీకాకుళం జిల్లాలో ఏచర్ల మండలంలో సాయుధ దళంలో పదిమంది హెడ్ కానిస్టేబుల్ ర్యాంకు గల రైటర్లు పూర్తి స్థాయిలో వీరు ఒక విధులు నిర్వహించవలసి ఉన్న ఒకే విధులకు పరిమితమై పోయారు. దీనికి గల కారణం జిల్లాలో గల 3 సామాజిక కులాలకు చెందిన వారు కావడంతో వీరికి ఎదురు చెప్పేవారు లేకుండాపోయారు. దీనికి సాయుధ దళంలో పోలీసు అధికారులు వీరికి పూర్తిగా సహాయ సహకారం అందిస్తున్నారు. దీనివలన ఒక రిజర్వు ప్లేటును సాయుధ దళానికి చెందిన ఒక రైటర్ మొత్తం కానిస్టేబుల్. ఇందులో ఒక రైటర్ ర్యాంకు గల హెడ్ కానిస్టేబుల్ వీరందరి విధులకు సరిగ్గా చేసుకోని లేకుండా వీధులను భంగం కలిగిస్తున్నాడు. ఇదేమి డ్యూటీలు వేయడం అని ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్నించే వారిని ఏచర్ల సాయుధ పోలీసు అధికారుల చేత అనేక క్లిష్టతరమైన వంటి విధులను ఖచ్చితంగా నిర్వహించాలని హుకుం జారీ చేస్తున్నారు. ఈ సంఘటన పట్ల ఏచర్ల సాయుధ పోలీసు దళంలో పనిచేస్తున్నకానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ అందరూ కూడా వెంకటేశ్వర నామం జపించాల్సి రావ‌డం గ‌మ‌నార్హం. ఏచర్ల రిజర్వు పోలీసు దళంలో అధికారులుగా కూడా వెంకటేశ్వర నామం జపించవలసిన పరిస్థితి ఉంది. ఇంకా లోతుగా ఈ హెడ్ కానిస్టేబుల్ పై కూడా అనేక ఆరోపణలున్నాయి. గతంలో వచ్చినప్పటికీ పోలీసు ఉన్నతాధికారులు ఇతని పై ఎటువంటి చర్యలు తీసుకోక‌పోవ‌డం విశేషం. కారణాలు అన్వేషిస్తే ఈ రైటర్ చేసిన తప్పుడు పనులు అన్నిటికీ ఏచర్ల సాయుధ పోలీసు దళంలో పనిచేస్తున్నపోలీసు శాఖ అధికారులు కొంతమంది ఈ రైటర్స్ సామాజిక వర్గం వారు కావడం వల్ల ఇతను ఆడిందే ఆటగా పాడింది పాటగా కొనసాగుతోంది. ఈ రైటరు ఏ రోజు కూడా బయట విధులను నిర్వర్తించకుండా సాయుధ దళాల పోలీస్ అధికారులకు అధికారులకు అనేక రకములుగా వారిని ప్రసన్నం చేసుకుంటున్నారు, మరొక విషయం ఏంటంటే ఎవరికైనా పోలీసు వీధులు మార్పు చెయ్యాలంటే వారు కూడా ఒక సాయుధ దళానికి చెందిన ఈ రైటర్ కు అనేక రకాలుగా ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. మాట వినని పోలీస్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ కు రోజు రోజుకు, వారా వారానికి దూరప్రాంతాల ప్రాంత విధులను, కష్టతరమైన విధులను అప్ప‌చెబుతారు. ఈ తంతు జరుగుతున్నా సాయుధ పోలీస్ అధికారులు త‌మ‌కేమీ ప‌ట్ట‌న‌ట్లుగా వ్యవహరించ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు తావీస్తోంది.

ఈ సంఘటన పట్ల శ్రీకాకుళం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అయినా అమిత్ స్పెషల్ బ్రాంచ్ ఒక ఉన్నత స్థాయి అధికారి చేత పూర్తి ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపి ఇందుకు సంబంధించిన ఈ రైటర్ హెడ్ కానిస్టేబుల్ పై క్రమశిక్షణ చర్య తీసుకోవాల్సిందిగా సాయుధ దళాల చేస్తున్నపోలీసులు ముక్త కంఠంతో కోరుతున్నారు.

Related posts

బలిజ కులస్తులు రాజ్యాధికారం కోసం పోరాడాలి

Satyam NEWS

పిచ్చుక

Satyam NEWS

శ్రీశైలంలో ఇక ఆన్ లైన్ ద్వారా మాత్రమే సేవలు

Satyam NEWS

Leave a Comment