32.2 C
Hyderabad
April 20, 2024 19: 35 PM
Slider వరంగల్

పోలీసులు నైపుణ్యంతో కూడిన దర్యాప్తు చేపట్టాలి

#tarunjoshiips

నేరస్థులకు పట్టుకోనేందుకుగాను పోలీస్ అధికారులు నైపుణ్యంతో కూడిన దర్యాప్తు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు. ఆర్థ సంవత్సర నేర సమీక్షా సమావేశంలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని శనివారం వరంగల్ కాకతీయ విశ్వ విద్యాలయములోని సెనేట్ సమావేశ ప్రాంగణంలో నిర్వహించారు.

డిసిపి, ఏసిపిలు, ఇన్ స్పెక్టర్లు, ఎస్.ఐలు పాల్గొన్న ఈ సమావేశంలో ముందుగా పోలీసు కమిషనర్ ముందుగా డ్రైవ్ కేసులు, ప్రాపర్టీ నేరాలు, ఎస్సీ, ఎస్టీ, మహిళలపై నేరాలు, మిస్సింగ్, ఎన్.డి.పి.ఎస్, చిట్ ఫండ్, రోడ్డు ప్రమాదాలు, ఈ. పెట్టి కేసులకు సంబంధించి గత ఏడాదికి మరియు ఈ సంవత్సరంలో గడిచిన ఆరు నెలల కాలంలో జరిగిన కేసుల వ్యత్యాసాలపై పోలీస్ కమిషనర్ సంబంధిత పోలీస్ అధికారులతో కలిసి విశ్లేషించారు.

అనంతరం ప్రస్తుతం నమోదైన కేసుల ప్రస్తుత స్థితి గతులతో పాటు, ఈ కేసుల్లోని నిందితుల అరెస్ట్ , కేసుల దర్యాప్తు , రికవరీ, కోర్టులో పెండింగ్ వున్న కేసులు వాటి స్థితి గతులపై పోలీస్ కమిషనర్ కేసుల వారీగా సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

మత్తు పదార్ధాలను పటిష్టంగా అమలు చేయాలి

యువతను మత్తుకు బానిసలుగా మారుస్తున్న మత్తు పదార్థాల విక్రయాలను కట్టడి చేసేందుకుగాను ప్రతి పోలీస్ అధికారి మరింత శ్రమించాల్సి వుంటుందని. గంజాయి రహిత పోలీస్ స్టేషన్ గా గుర్తింపు వచ్చే విధంగా ప్రతి పోలీస్ స్టేషన్ అధికారి తమ పరిధిలో గంజాయి అమ్మకాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించి పీడీయాక్ట్ క్రింద కేసులను నమోదు చేయాలని, ముఖ్యంగా గంజాయి విక్రయాలు, వినియోగించే హట్ స్పాటు అధికారులు గుర్తించి వాటిపై నిరంతరం నిఘా పెట్టాల్సి వుంటుందని పోలీస్ కమిషనర్ తెలిపారు. అదే విధంగా నేరాల నియంత్రణకై ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో విజుబుల్ పోలీసింగ్ లో భాగం నిరంతరం పోలీసుల గస్తీ నిర్వహించాల్సిన అవసరం వుందని కమిషనర్ తెలిపారు.

రోడ్డు ప్రమాదాల నివారణకై తగు ముందస్తూ చర్యలు తీసుకోవడంతో పాటు, అధికారులు రోడ్డు ప్రమాదాలకు గల కారణాలపై విశ్లేషణ చేసి రోడ్డు ప్రమాదాల కట్టడికి తగు రీతిలో చర్యలు తీసుకోవాలి. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు స్టేషన్ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించాలి.

అలాగే ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలి. పెండింగ్ లో వున్న మిస్సింగ్ కేసులకు పరిష్కరించేందుకుగాను అధికారులు ప్రత్యేక చొరవ చూపాల్సి వుంటుందని.మిస్సింగ్ కేసుల్లోని వ్యక్తుల అచూకీ కనుగోని వారిని వారి తల్లిదండ్రులకు అప్పగించాలని. పెండింగ్ లో వున్న కేసులను త్వరితగతిన పరిష్కరించి. సంబంధిత నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని సూచించారు.

ముఖ్యంగా కేసులు దర్యాప్తు చేసే సమయంలో అధికారులు ఎస్.ఓ.పిని అనుసరించాలని. నేరస్థుల నేరాలను కోర్టులో నిరూపించే విధంగా తగు సాక్ష్యాధారాలను కోర్టు సమర్పించడంలో అధికారులు మరింత శ్రద్ధ కనబర్చాలని, నేరాలను కట్టడి చేయడంతో పాటు నేరస్తులను గుర్తించడంలో కీలకంగా నిలుస్తున్న సిసి కెమెరాల ఏర్పాటుతో పాటు మత్తు పదార్థాలు, సైబర్ క్రైమ్స్, రోడ్డు ప్రమాదాలపై ప్రజలతో పాటు విధ్యార్థులకు మరింత అవగాహన కల్పించేందుకు మరిన్ని అవగాహన సదస్సులను ఏర్పాటు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు తెలియజేశారు. ఈ సమావేశంలో డిసిపిలు వెంకలక్ష్మీ, అశోక్ కుమార్,సీతారాం, అదనపు డిసిపిలు వైభవ్ గైక్వాడ్, పుష్పారెడ్డి పాల్గొన్నారు.

Related posts

విజయనగరం లో “క్లాప్” ద్వారా సంకల్ప ర్యాలీ ప్రారంభం..!

Satyam NEWS

మహా సిమెంట్ ఆధ్వర్యంలో క్షయ వ్యాధి నిర్ధారణ క్యాంపు

Satyam NEWS

రోడ్ టెర్రర్: సాగర్ హైవే పై లారీ ఆర్టీసీ బస్సు ఢీ

Satyam NEWS

Leave a Comment