మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సతీమణి భారతీ రెడ్డి పీఏ గా ప్రచారంలో ఉన్న వర్రా రవీంద్రారెడ్డి సోషల్ మీడియా కేసులో విచారణ వేగంగా సాగుతున్నది. వర్రా కేసులో వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్లను పోలీసులు విచారిస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్లు నేడు కడప సైబర్ క్రైమ్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. వీరిలో సునీతరెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఆనంద్‌రెడ్డి ఉన్నారు. అధికారపార్టీ నేతలపై అసభ్య పోస్టులు వైరల్ చేశారని ముగ్గురిపై ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ నేతలు విష్ణువర్ధన్‌రెడ్డి, నరేంద్రరెడ్డి నిన్న సైబర్ క్రైమ్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈనెల 8న పులివెందుల పీఎస్‌లో వర్రా రవీంద్రరెడ్డితో పాటు మరికొందరిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే 15 మందికి 41 ఏ నోటీసులను పోలీసులు జారీ చేశారు.
previous post