నల్లగొండ జిల్లా హాలియాకు చెందిన శ్రీనివాస్, భవాని దంపతులు. వారు తమ కారులో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరారు. తెల్లవారు జామున 4 గంటలకు వారు విమానాన్ని ఎక్కాల్సి ఉంది. మార్గమధ్యంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో వారి కారు పంక్చర్ అయింది.
ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నంబర్ 13 సమీపంలో వారి కారు ఆగిపోయింది. అప్పటికి సమయం తెల్లవారు జాము 2 గంటలు…. ఏం చేయాలి? ప్రత్యామ్నాయ మార్గాలేవీ కనిపించ లేదు. సాయం చేసేవారు లేరు. కనుచూపు మేరలో పరిష్కారం కనపడలేదు. ఏం చేయాలి? వెంటనే వారు డయల్ 100కు ఫోన్ చేశారు. తమ పరిస్థితిని, తాము ఉన్న ప్రదేశాన్ని వివరించారు.
ఫోన్ చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలో పోలీసులు స్పందించారు. 15 నిమిషాల్లో ఆదిభట్ల పోలీసులు మెకానిక్ తో సహా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మెకానిక్ తో టైరును సరి చేయించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న 20 నిమిషాల్లోనే ఇదంతా పూర్తయింది. దంపతులు సేఫ్. హ్యాట్సాఫ్ టు పోలీస్.