28.7 C
Hyderabad
April 20, 2024 04: 58 AM
Slider విజయనగరం

పవిత్రమైన రంజాన్ సందర్భంగా పోలీసు ఉదారం..!

#police

పవిత్ర రంజాన్ రోజు నే కఠిన హృదయాలని ముద్ర పడిన ఖాకీలు… బాధితులు పరంగా ఆలోచించి… మంచి పనికి శ్రీకారం చుట్టి శభాష్ అనిపించుకున్నారు. పోలీసు స్టేషనుకు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారుల సౌకర్యార్థం వేసవిలో ఉపశమనం పొంది, దాహార్తి తీర్చేందుకు  విజయనగరం రూరల్ పోలీసులు విటి అగ్రహారం వై జంక్షన్ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేసారు.ఈ మేరకు విజయనగరం రూరల్ సిఐ టివి తిరుపతిరావు దాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా సిఐ టివి తిరుపతిరావు మాట్లాడుతూ  ఎండలు తీవ్రంగా ఉన్నందున అకారణంగా ఎండలో ప్రజలు ఎవరూ తిరగవద్దని, వడ దెబ్బకు గురికావద్దన్నారు. వడ దెబ్బకు గురికాకుండా తమ పనులను ఉదయం లేదా సాయంత్రంకు  వాయిదా వేసుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీ .దీపిక  ఆదేశాలతో విటీ అగ్రహారం వై జంక్షన్ వద్ద ప్రజల సౌకర్యార్థం చలి వేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు రూరల్ పోలీసులు ఏర్పాటు చేసిన చలి వేంద్రంను ఉపయోగించుకోవాలని, చల్లని నీరు త్రాగి, తీవ్ర ఎండల నుండి ఉపశమనం పొందాలని ప్రజలకు సిఐ టివి తిరుపతిరావు విజ్ఞప్తి చేసారు. ఈ చలివేంద్రం ప్రారంభ కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ గణేష్, స్టేషన్ సిబ్బంది,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Related posts

కెసిఆర్ నాయకత్వం దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు

Satyam NEWS

బిజెపి పాలిత రాష్ట్రాల్లో మహిళలకు రక్షణ లేకుండా పోయింది

Satyam NEWS

మావోల ఏరియాల్లో ప్రత్యేక నిఘా

Bhavani

Leave a Comment