28.7 C
Hyderabad
April 20, 2024 08: 11 AM
Slider నల్గొండ

సిబ్బంది కుటుంబాలకు బాసటగా పోలీసు భద్రత స్కీమ్

#suryapetsp

సూర్యాపేట జిల్లా ఆర్ముడ్ రిజర్వ్ నందు హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న కోటిరెడ్డి అనారోగ్యంతో ఆకాలంగా మృతి చెందారు. మృతి చెందిన కోటిరెడ్డి  కుటుంబ సభ్యులకు పోలీసు భద్రత ఇస్యూరెన్స్ స్కీం ద్వారా 8 లక్షల నగదు చెక్కును జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ బుధవారం అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు శాఖలో పని చేస్తూ అకాల మరణం పొందిన  సిబ్బంది కుటుంబాలను తెలంగాణ పోలీసు శాఖ అన్ని విధాలుగా అదుకుంటుందన్నారు. దివంగత సిబ్బంది కుటుంబాలకు పోలీసు భద్రత స్కీమ్ బాసటగా నిలుస్తుందని, కోటిరెడ్డి కుటుంబం సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ గోవిందరావు, జిల్లా పోలీసు సంఘం అధ్యక్షులు రామచందర్ గౌడ్, సెక్రెటరీ వెంకన్న, సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీకాంత్,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

2012 బ్యాచ్ కానిస్టేబుల్స్ దాతృత్వం

సూర్యాపేట టౌన్ పీఎస్ లో పని చేస్తున్న 2012 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ వీర ప్రసాద్ అకాల మరణం చెందడంతో వీర ప్రసాద్ కుటుంబానికి 2012 బ్యాచ్ కానిస్టేబుల్స్, పోలీస్ స్టేషన్ సిబ్బంది తమవంతుగా ఆర్థిక సహాయం అందించి వారి దాతృత్వం చాటుకున్నారు.

2012 బ్యాచ్ కానిస్టేబుల్ సిబ్బంది అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తలాకొంత జమచేసి 3 లక్షల రూపాయల చెక్కును ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా వీర ప్రసాద్ కుటుంబ సభ్యులకు చెక్కును అందించారు. ఈ సందర్భంగా సిబ్బంది యొక్క ఆలోచనను, దాతృత్వంను జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సంఘం ప్రెసిడెంట్ రామచందర్ గౌడ్, సెక్రెటరీ వెంకన్న, 2012 బ్యాచ్ స్నేహితులైన గుండాల సతీష్, తంగళ్ళపల్లి జనార్ధన్,బాలకృష్ణ, అఖిల్,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Related posts

మార్గదర్శికి ఏపీ హైకోర్టులో ఊరట

Satyam NEWS

నిరుపేద విద్యార్థికి శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ (రాజుపేట) సహాయం

Bhavani

అగ్గిపెట్టెలో పట్టిన చీర నేసిన సిరిసిల్ల నేతన్న

Satyam NEWS

Leave a Comment