36.2 C
Hyderabad
April 25, 2024 21: 54 PM
Slider విజయనగరం

వెపన్ పట్టాల్సిన ఖాకీ చేతులు ఏం పట్టాయో తెలుసా…?

#vijayanagarampolice

ప్రస్తుత పరిస్థితుల్లో ఖాకీ అన్న పదాన్నే మార్చేసారు…ఖాకీ దుస్తులేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులు పోలీసులు. ఖాకీ అన్న పదం…నీచమైన పనులు చేసేటప్పుడు ఉపయోగించే పదం. గడచిన ఏడాది నుంచీ పోలీసులు… సేవా భావాన్ని కూడా అలవర్చుకున్నారు. కరోనా పుణ్యమా పోలీసులలో కరకుదనం, కాఠిన్యం వంటి పదాలను దరిచేరనివ్వకుండా.. ఆపదలో ఆదుకునేవారవుతున్నారు. తాజాగా ‘గులాబ్’ తుపాన్ సృష్టించిన అలజడి లో…కళ్లముందు కొట్టుకు పోతున్న ప్రజలను కాపాడే దేవుళ్లవుతున్నారు..పోలీసులు.

ప్రస్తుతం గులాబ్ తుపాను లో రెవెన్యూ తో పాటు పోలీసులు కూడా తమకు మనసు, హృదయం ఉన్నాయని…మాకు కూడా కుటుంబం ఉందని…ఆపదలో ఆదుకుంటామని మాటలలో కాకుండా చేతలలో చేసి చూపిస్తున్నారు.ఇది సోది కాదు..అక్షర సత్యం… అదే సత్యం న్యూస్. నెట్ చెబుతున్న కాదు..కాదు.. చూపిస్తున్న నగ్న సత్యం.

విజయనగరం జిల్లా పోలీసు శాఖలో యావత్ సిబ్బంది గతేడాది కరోనా పుణ్యమా చేసిన, చూపించిన సేవి నిరతి చెప్పలేనిది. తాజాగా “గులాబ్” తుపాను లో సామాన్య ప్రజలు పడుతున్న కష్టాలను స్వయంగా చూసిన పోలీసులు చలించిపోయారు..అంతే నా అక్కడితో ఆగకుండా.. ఓ చెయ్యి వేసి…ఆపదలో ఉన్న వారికి మేము పోలీసులమే కాదు.. ఆపధ్భాంధవులను అని చేసి చూపించారు.

జిల్లా ఎస్పీ దీపికా ఆదేశాలతో గజపతినగరం, పూసపాటిరేగ, పార్వతీపురం, సీతానగరం పోలీసు స్టేషన్ల పరిధులలో పోలీసులు….వర్ష బీభత్సం లో చిక్కుకున్న వారిని స్వయంగా కాపాడారు. గజపతినగరం సీఐ రమేష్, ఎల్విన్ పేట సీఐ తిరుపతిరావు, పూసపాటిరేగ ఎస్ఐ జయంతి, బొండపల్లి ఎస్ఐ వాసుదేవ్ ఇతర పోలీసు సిబ్బంది… తమలో ఉన్న సేవా నిరతితో. వర్ష బీభత్సం లో చిక్కుకున్న విరిని కాపాడి శభాష్ పోలీసు అనిపించుకునేలా వ్యవహరించారు. ఏదైనా ఖాకీ దుస్తులు వేసుకున్న పోలీసులలి మెల్లమెల్లగా కాఠిన్యం పోయి… కారుణ్యం తొణికిసలాడుతోందని అని అంటోంది… సత్యం న్యూస్. నెట్.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్

Related posts

టి‌ఆర్‌ఎస్ భారీ ర్యాలీ

Murali Krishna

రాజ్యాంగం పై అందరికి అవగాహన ఉండాలి

Satyam NEWS

ప్రగతి దివ్వెలు

Satyam NEWS

Leave a Comment