38.2 C
Hyderabad
April 25, 2024 11: 27 AM
Slider తూర్పుగోదావరి

రాజమండ్రిలో నర్సు కుటుంబంపై పోలీసుల దౌర్జన్యం

#RajahmendryPolice

ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినం, నర్సుల దినోత్సవం అయిన ఈరోజు ఒక స్టాఫ్ నర్స్, ఆమె భర్త 108 ఎంప్లాయ్ పట్ల అత్యంత అవమానకరంగా, అమానవీయంగా వ్యవహరించిన రాజమండ్రి 3 టౌన్ CI దుర్గా ప్రసాద్ సస్పెండ్ చేయాలని కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ స్టాఫ్ నర్సెస్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది‌‌. ఈ మేరకు యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అచ్యుతవల్లి, G.భవాని , గౌరవాధ్యక్షురాలు M.వీరలక్ష్మి సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ కాకినాడ GGH లో స్టాఫ్ నర్స్ గా విధులు నిర్వహిస్తున్న హేమలత ఆమె భర్త 108 ఉద్యోగి ఇద్దరూ తమ కుటుంబ సభ్యులు అనారోగ్యం తో ఉన్న కారణంగా వారిని చూసి, తిరుగు ప్రయాణం లో ఉండగా రాజమండ్రి క్వారీ మార్కెట్ వద్ద త్రీ టౌన్ పోలీసులు అడ్డగించారు అన్నారు హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నామని ఇప్పుడు డ్యూటీ కి వెళ్లాల్సి ఉందని పదే పదే చెప్పినప్పటికీ పోలీసులు విడిచిపెట్టలేదు అన్నారు. అంతేకాకుండా త్రీటౌన్ సీఐ దుర్గాప్రసాద్ స్టాఫ్ నర్స్ దంపతులను అసభ్యకరంగా తిడుతూ, 108 ఉద్యోగి అయినటువంటి ఆమె భర్తను పీకపై కాలు వేసి తొక్కడం చాలా అమానవీయం అన్నారు.

ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినం రోజు నర్సులు అందరికీ గౌరవం తెలియజేసే విధంగా ప్రపంచమంతా నర్సుల దినోత్సవంగా జరుపుకుంటే రాజమండ్రి పోలీసులు మాత్రం స్టాఫ్ నర్స్ హెల్త్ డిపార్ట్మెంట్ చెప్పినా కూడా వినకుండా ఇంత దుర్మార్గంగా అవమానించడం పోలీసు వ్యవస్థకే మచ్చ తెస్తుందన్నారు .రాజమండ్రి టౌన్ సిఐ దుర్గాప్రసాద్ కనీసం మహిళల పట్ల కూడా గౌరవ భావం లేకుండా అసభ్య పదజాలం వాడటం క్షమించరాని నేరం అన్నారు. ఇలాంటి వారిని తక్షణం సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. తక్షణం రాజమండ్రి పోలీసులపై, CI దుర్గా ప్రసాద్ పై కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు.

ప్రవీణ్ తిత్తి

Related posts

కొల్లాపూర్ కంచుకోటలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదా?

Satyam NEWS

జగన్ మోహన్ రెడ్డి పాలనలో రెడ్లలోనే అసంతృప్తి ఎందుకు?

Satyam NEWS

రివెంజ్:కౌన్సిలర్ సోదరునిపై హత్య యత్నం

Satyam NEWS

Leave a Comment