39.2 C
Hyderabad
March 29, 2024 16: 01 PM
Slider మహబూబ్ నగర్

లాక్ డౌన్ పేరుతో జర్నలిస్టులను కట్టడి చేయవద్దు

#narayanpet police

విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి పని చేస్తున్న జర్నలిస్టులను సానుభూతితో అర్ధం చేసుకోకుండా దురుసుగా ప్రవర్తించడం తగదని టియుడబ్లు జె (ఐజేయు) నారాయణ పేట్  జిల్లా కన్వీనర్ గద్దెగూడెం యాదన్న అన్నారు.

శుక్రవారం రోజు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి వస్తుండడంతో ధర్నా చౌక్ దగ్గర  కొంతమంది పాత్రికేయులు వార్త సేకరణ కోసం  నిల్చుండగా ఏ ఆర్ ఇన్స్పెక్టర్ వచ్చి వారిపై దౌర్జన్యం చేశాడని ఆయన తెలిపారు. 

మీరు ఇక్కడ నిల్చోవటానికి వీల్లేదంటూ వాగ్వివాదనికి దిగారని,  లాక్డౌన్ సమయంలో పాత్రికేయులకు తిరిగే అనుమతులు ఉన్నా పోలీసులు అత్యుత్సాహం చూపటం మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు.

ఇటువంటి సంఘటనలు పోలీసులకు, జర్నలిస్టులకు ఇద్దరికి మంచిది కాదని నిబంధనల ప్రకారమే అందరూ మెలగాలని ఆయన కోరారు.

ఇక ముందు జర్నలిస్ట్ ల పై పోలీసులు దౌర్జన్యం చేస్తే ధర్నాలు చేపట్టి రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

Related posts

‘బాస‌ర‌’ ఆల‌య పునఃనిర్మాణానికి  శ్రీకారం

Satyam NEWS

వీధి కుక్కల స్వైర విహారం అరికట్టండి

Satyam NEWS

Custom essay writing service is an impressive choice for college learners who will be having difficulties to write their papers

Bhavani

Leave a Comment