40.2 C
Hyderabad
April 19, 2024 15: 32 PM
Slider హైదరాబాద్

లావణ్య మరణానికి కారణమైన మహిళ గుర్తింపు

#Lavanya

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కానీ మోజు తీరిందో ఏమో గానీ మరో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇవన్నీ కలిసి ఆమె ఆత్మహత్యకు దారి తీశాయి. శంషాబాద్ లో నివాసం ఉంటున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ లావణ్య లహరి ఆత్మహత్య జరిగిన మూడు రోజులలో అత్యంత కీలకమైన విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి.

లావణ్య లహరి భర్త వెంకటేశ్వరరావు తన కళ్ల ముందే మరొక అమ్మాయితో చనువుగా ఉండటాన్ని లావణ్య భరించలేకపోయింది. ప్రేమించి పెళ్లి  చేసుకున్న భర్త ఇలా తయారు కావడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ఇప్పటికే సాక్ష్యాధారాలను సేకరించిన పోలీసులు వెంకటేష్ ను అరెస్టు చేశారు. వెంకటేష్ సన్నిహితంగా ఉన్న మహిళ అతనితో పని చేసే మహిళ గా పోలీసులు గుర్తించారు.

ఈ మహిళతో వెంకటేశ్వర‌‌రావు ఉండగా లావణ్యకి రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. దీంతో లావణ్య అతడిని నిలదీసింది. అయితే ఆ తర్వాత నుంచి వెంకటేశ్వర‌‌రావు మరింతగా రెచ్చిపోయాడు. ఇంట్లో ఉండే ఆ మహిళతో సోషల్‌ మీడియాలో చాటింగ్‌ చేయడంతో పాటు.. లావణ్య ముందే ఆమెకు వీడియో కాల్స్‌ చేసి మాట్లాడేవాడని పోలీసులు తెలిపారు.

దీంతో లావణ్య తనకు అన్యాయం చేయవద్దని ఆ మహిళను వేడుకున్నారు. మరోవైపు తీరు మార్చుకోని వెంకటేశ్వర‌‌రావు.. లావణ్యపై భౌతిక దాడులకు పాల్పడ్డాడు. గర్భవతి అనికూడా చూడకుండా భర్త తనపై దాడి చేయడంతో లావణ్య మరింత ఉద్వేగానికి లోనయ్యారు. తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి అసలు రూపం తెలుసుకుని మనస్తాపం చెందారు.

ఈ క్రమంలో లహరి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో లావణ్య మృతికి సంబంధించి మరో మహిళ పాత్రపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి కీలక ఆధారాలు కూడా సేకరించినట్టుగా సమాచారం. మరోవైపు తమ కూతురిని వెంకటేశ్వర‌‌రావు హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని లావణ్య తండ్రి ఈశ్వరయ్య ఆరోపించారు.

పెళ్లి జరిగిన నాటి నుంచి అనేక రకాలుగా వేధించాడని, తమ నుంచి లక్షల రూపాయలు దండుకున్నాడన్నారు. అతడి పైలట్‌ లైసెన్స్‌ను రద్దు చేసి, కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

Related posts

ఛారిటీ: నిరుపేద కుటుంబాలకు పెళ్లి కానుక

Satyam NEWS

కర్నాటకలో పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలు

Satyam NEWS

కరోనా ప్రబలుతున్న వేళ హోళీ పండుగ నిషేదాజ్ఞలు..!

Satyam NEWS

Leave a Comment