30.2 C
Hyderabad
February 9, 2025 20: 54 PM
Slider రంగారెడ్డి

హజ్బెండ్ అండ్ వైఫ్: నేరేడ్ మెంట్ ఎస్ ఐ అత్యుత్సాహం

maxresdefault

సివిల్ తగాదాలలో జోక్యం చేసుకోవద్దని పోలీసు అధికారులు చెబుతున్నా కింది స్థాయి పోలీసులు మాత్రం అత్యుత్సాహం చూపిస్తూనే ఉంటారు. నేరేడ్ మెట్ పోలీస్ స్టేషల్ లో ఈ సంఘటన జరిగింది. భార్య ఒక భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్తను పోలీస్ స్టేషన్ కి పిలిచి కౌన్సిలింగ్ చేయాల్సిన పోలీసులు భర్త ముత్యాలును లాఠీతో విపరీతంగా కొట్టడంతో అతనికి చేతులపై ,కాళ్లపై వాతలు పడి నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు.

అంతయ్య కాలనిలో నివసించే ముత్యాలు ఒక ప్రైవేట్ ఉద్యోగి. నిన్న రాత్రి భార్యాభర్తల మధ్య చిన్న గొడవ జరగడంతో భార్య కూకట్ పల్లిలో ఉండే వాళ్ళ తమ్ముడుకి ఫోన్ చేసి చెప్పడంతో వాళ్ల తమ్ముడు ఇద్దరు మిత్రులతో కలిసి వచ్చి ముత్యాలు పై దాడి చేసి వాళ్ళే పోలీసులకు ఫిర్యాదు చేసారని భాదితుడు వాపోతున్నాడు. పోలీసులు వచ్చి ముత్యాలును స్టేషన్ కి తీసుకెళ్లారు.

నైట్ డ్యూటీలో ఉన్న ఎస్సై సైదులు నన్ను ఏమి అడగకుండానే ఎటువంటి విచారణ జరపకుండా రాత్రి 11.30 గంటల సమయంలో లాఠీతో విపరీతంగా కొట్టాడని బాధితుడు ముత్యాలు ఆవేదన వ్యక్తం చేసాడు. ఎస్.ఐ సైదులు పై రాచకొండ కమీష్ నర్ కు అతను ఫిర్యాదు చేసాడు.

Related posts

రేపు జరగబోయే కలెక్టర్ ముట్టడిని విజయవంతం చేయండి

Satyam NEWS

పుస్తక పఠనం ఓ చక్కని అలవాటు

Murali Krishna

కాంట్రవర్సీ నేచర్: తీరు మారని బైంసా నిత్యం ఘర్షణలే

Satyam NEWS

Leave a Comment