32.7 C
Hyderabad
March 29, 2024 13: 10 PM
Slider కర్నూలు

రాజకీయ నాయకుల్లా కొట్లాడుకుంటున్న పోలీసులు

#nandyal police

పోలీసు శాఖ అంటే ఎంతో క్రమశిక్షణతో ఉండాలి కదా? ఉండాలి.. నిజమే కానీ కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో మాత్రం అలా జరగలేదు. ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ రాజకీయ నాయకులనే తలదన్నిపోయారు.

ఎస్సై పీరయ్య కు అదే స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ సుబ్బరాజు మధ్య ఆధిపత్య పొరు నడిచింది. ఒకరిపై ఒకరు డిఎస్పీకి పిర్యాదు చేయడం తో ఆయన జిల్లా ఎస్పీకి నివేదిక పంపారు. వివరాల్లోకి వెళితే నంద్యాల టూ టౌన్ లో ఎస్సై గా పీరయ్య విధులు నిర్వహిస్తున్నారు.

పట్టణంలో వివిధ పోలీస్ స్టేషన్ లలో కొన్నేళ్లుగా సుబ్బరాజు రైటర్ గా పని చేసి అన్ని పోలీస్ స్టేషన్ లతో పాటు అందరితో మంచిగా మెదిలే వారు. ఫిర్యాదుదారులు, సమస్య ఉన్నవారు  ఆయన వద్దకు అధికంగా వచ్చి సలహాలు తీసుకునే వారు.

స్టేషన్ లో సిఐ గా కంబగిరి రాముడు విధుల్లో చేరారు. వారిద్దరి మధ్య అధిపత్యపోరు ను గమనించినట్లు తెలిసింది. ఇద్దరిని వేరు వేరుగా పిలిచి పద్ధతి మార్చుకోవాలని, మీ వల్ల పోలీస్ శాఖకు చెడ్డపేరు వస్తుందని చెప్పినా స్టేషన్లో ఒక హెడ్ కానిస్టేబుల్ కు గౌరవం ఉందనే ఇగో  ఎస్సై కు ఉండడంతో నే ఇలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నట్లు పోలీస్ శాఖలో గుస,గుసలు వినిపిస్తున్నాయి.

స్టేషన్లో సమస్యలు పట్టించుకోకుండా ఇద్దరు తరచు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తుంటే హెడ్ కానిస్టేబుల్ సుబ్బరాజుని రైటర్ స్తానంలో మరొకరిని నియమించి సుబ్బరాజుని బయట తిరిగేందుకు సిఐ నియమించడంతో కొద్ది రోజులు ప్రశాంతంగా సాగింది.

సిఐ కంబగిరి రాముడుకు బదిలీ లో భాగంగా కర్నూల్ రూరల్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సిఐ గా రమణ బాధ్యతలు చేపట్టారు.

షరా మాములు కావడంతో ఇద్దరి వ్యవహారం పై డిఎస్పీ దృష్టికి తీసుకొని వెళ్లారు. ఆయన జిల్లా ఉన్నతాధికారి సమాచారం ఇవ్వడంతో ఎస్సై కి స్థానచలనం కల్పించారు. హెడ్ కానిస్టేబుల్ సుబ్బరాజు ను విఆర్ కు పంపించారు.

Related posts

ట్రిబ్యూట్: అమర జవాన్లకు ఘన నివాళి

Satyam NEWS

శ్రీశైలమల్లన్న స్పర్శదర్శనం పునప్రారంభం..

Satyam NEWS

ఎమ్మెల్యే గూడెం కొడుకు మృతి

Bhavani

Leave a Comment