32.7 C
Hyderabad
March 29, 2024 11: 07 AM
Slider విజయనగరం

క‌రోనా క‌ల్లోలం పై సిబ్బందిని హెచ్చ‌రించిన పోలీస్ ఉన్న‌తాధికారిణి….!

#vijayanagarampolice

క‌రోనా కేసులు పెరుగుతున్న  అటు పోలీస యంత్రాంగం ఇటు రెవిన్యూ యంత్రాంగం ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా..ప్ర‌జ‌ల‌లో మార్పు వ‌స్తేనే కేసులు  త‌గ్గుముఖం ప‌డ‌తాయి.ఈ న‌గ్న స‌త్యాన్ని ప్ర‌తీ ఒక్క‌రూ గ్రహించాల్సి ఉంటుంది. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో పోలీస్,రెవిన్యూ,డాక్ట‌ర్ల త‌మ ,త‌మ కుటుంబాల‌ను ప‌క్క‌న పెట్టి మ‌రీ కరోనా నివార‌ణ‌కు తీసుకోవ‌ల‌సిన జాగ్ర‌త్త‌లు,చేప‌ట్ట‌వ‌ల‌సిన చ‌ర్య‌లు తీసుకునే ఉంటున్నారు..

ఇందులో బాగంగా ఏపీ రాష్ట్రం ఉత్త‌రాంధ్ర‌కే ప్ర‌సిద్ది గాంచిన ప్రిన్స్ ఆఫ్  వీల్స్(పీడ‌బ్య్లూ)మార్కెట్ లో నిత్యం వెల్లువెత్తుతున్న ర‌ద్దీ  త‌ద్వారా క‌రోన వైర‌స్ సొకుతోంద‌న్న  స‌మాచారంతో జిల్లా ఎస్పీ రాజ‌కుమారీ మ‌రోసారి త‌న సిబ్బందిని అలెర్ట్ చేసారు.

తొమ్మిద‌వ తేదీ ఆదివారం సంద‌ర్బంగా మార్క‌ట్ ర‌ద్దీని దృష్టిలో పెట్టుకుని లాక్ డౌన్ స‌డ‌లింపు స‌మ‌యంలో ఎస్ఐ ఆపై ఉన్న‌తాధికారులతో  సెట్ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. దీంతో ఆదివారం కాస్త‌…రెస్ట్ తీసుకోవ‌చ్చ‌నుకున్న పోలీసు అధికారులంద‌రూ లాక్ డౌన్ స‌డ‌లింపు అంటే ఉద‌యం  8 నుంచీ 11.30  గంట‌ల‌వ‌ర‌కు రోడ్డుమీద ఉండి విదులు నిర్వ‌హించడం అదే స‌మ‌యంలో సెట్ కాన్ఫ‌రెన్స్ ద్వారా ఎస్పీ ఇచ్చిన ఆదేశాల‌ను పాటించారు.

సిబ్బంది కొర‌కు న‌గ‌ర ప‌రిధిలో జేఎన్టీయూ….!

కరోనా కేసులు పెరుగుతున్న వేళ తన‌ సిబ్బందిని కాపాడుకోవ‌ల్సిన బాధ్య‌త ఎంతైనా…పోలీసు ఉన్న‌తాధికారుల‌దే. గ‌తేడాదిలో విప‌రీతంగా క‌రోనా కేసులు పెర‌గ‌డంతో దాదాపు 500  మందికి పైగా దాని బారిన ప‌డి జిల్లాలో సారిప‌ల్లిలో కేటాయించిన క్వారంటైన్ సెంట‌ర్ ల‌లో చికిత్స పొందారు. 

ఈ ఏడాదిలో కూడా కేసులు పెరగ‌డం..చాలా మంది శాఖా సిబ్బంది హోంఐసోలేష‌న్ లో ఉంటున్నారు.కొంద‌రికి ప‌రిస్థితి సీరియ‌స్ గా ఉండ‌టంతో జిల్లా కేంద్రంలోని జేఏన్టీయూ లో సిబ్బంది కొర‌కు కేటాయించింది..పోలీస్ శాఖ‌. ఏదైనా ప్ర‌స్త‌తం ఈ క‌రోనా సెకండ్ వేవ్ లో..ప్ర‌తీ ఒక్క‌రూ త‌స్మాత్ జాగ్ర‌త్త అంటూ హెచ్చిరిస్తోంది..స‌త్యం న్యూస్.నెట్

Related posts

కాశ్మీర్ చొరబాట్లు: ముగ్గురు ఉగ్రవాదుల హతం

Satyam NEWS

ఉరేసుకుని ఉపాధ్యాయుడు ఆత్మహత్య

Satyam NEWS

ఇమ్రాన్ ఖాన్ భావాలకు అనుగుణంగానే అమెరికా

Satyam NEWS

Leave a Comment