28.7 C
Hyderabad
April 25, 2024 05: 08 AM
Slider విజయనగరం

నిజంగా కరోనా కేసులు తగ్గాయంటే అందుకు కారణం వాళ్లే..!

#vijayanagaram police

గడచిన వారం రోజులు బట్టి ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.ఒక్కో జిల్లాలో రెండు వేలకు పై బడి నమోదవుతున్న కేసులు కాస్త వెయ్యిలోపు నమోదవుతున్నాయి.

అందుకు గల కారణం పోలీసులు అని చెప్పతప్పదు.రేయింబవళ్లు, పగలు రాత్రి అని తేడాలేకుండా డ్యూటీ చేస్తున్నది ఎవ్వరంటే పోలీసులే.అందులోను దిగువ స్థాయిలో ఉన్న పీసీలు..అదేనండి కానిస్టేబుళ్లు.

పై అధికారి ఏది చెబితే తలవంచి మరీ పని చేస్తూ ఏకంగా శాఖకే పేరు తెస్తున్నది ఎవ్వరంటే కానిస్టేబుల్. మరీ ముఖ్యంగా ఈ కరోనా సమయంలో ఇంటి పట్టున ఓ గంట ఉండలేదేమో.ఇంటి బాధ్యతలు పక్కన పెట్టి… కర్తవ్యమే ప్రధానమంటూ అందున తమ పై ఉన్నతాధికారి..డీఎస్పీ.సీఐ ,ఎస్ఐ ఇలా ఏ పై అధికారి వచ్చి ఇలా చెయ్యు.. ఇక్కడే ఉండు అని అదేశించడం తరువాయి…తు.చ తప్పకుండా కానిస్టేబుళ్లు పని చేస్తున్నారు.

ఉన్నతాధికారి వస్తున్నారనో లేక మీడియాలో పడాలనో..చాలా చోట్ల పోలీసు ఉన్నతాధికారులు… కరోనా సమయాలలో జంక్షన్ వద్ద పాయింట్ల వద్దకు వచ్చి వెళుతూ ఉంటారు.కానీ అక్కడే క్రమం తప్పకుండా.. ఉన్నతాధికారులు ఏది ఆదేశిస్తే అదే పాటిస్తున్నారు… కానిస్టేబుళ్లు.

ఈ నేపథ్యంలో కరోనా సందర్భంలో విజయనగరం జిల్లా కేంద్రం లో అర్థరాత్రి పోలీసులు బందోబస్తు ఎలా నిర్విహిస్తున్నారో…పరిశీలించేందుకు సత్యం న్యూస్. నెట్ ప్రతినిధి బయలుదేరివెళ్లారు. రాత్రి 12 గంటల సమయంలో నగరానికి చుట్టారు.

నగరంలో ని ప్రధాన జంక్షన్ల వద్ద అటు లా అండ్ ఆర్డర్ సిబ్బంది ఓ వైపు ఇటు ఎస్పీఎఫ్ సిబ్బంది మరోవైపు పహారా కాయడం కనిపించింది. ప్రధానంగా దాసన్నపేట రింగ్ రోడ్ ,ఐస్ ఫ్యాక్టరీ, ఆర్టీసీ కాంప్లెక్స్, ఎస్పీ బంగ్లా ,మయూరి జంక్షన్ ల వద్ద కానిస్టేబుళ్లు చేస్తున్న విధులు అనిర్వచనీయం.

కంటి మీద కునుకన్నది రానీయకుండా నగరంలో ని అన్ని ప్రధాన జంక్షన్ వద్ద కానిస్టేబుళ్లతో పాటు జంగిల్ డ్రస్ వేసుకున్న ఎస్టీఎఫ్ సిబ్బంది రోడ్ల పై వచ్చే ప్రతీ వాహనాన్ని ఆపి వివరాలు కనుక్కుని పంపించడం సత్యం న్యూస్.నెట్ కెమార కంట పడింది.

మరికాసేపట్లో సీఒ ,డీఎస్పీ వస్తారేమో అని ఎదురు చూడకుండా వాళ్ల కోసం పని చేస్తున్నామని అనుకోకుండా , నిబధ్ధత తో అర్థరాత్రి ప్రతీ ఒక్క సిబ్బంది పని చేయడం అభినందనీయం. కానిస్టేబుల్ వృత్తి కి హేట్సాఫ్.

Related posts

మజ్లీస్ మద్దతుతో మేయర్ పీఠంపై టీఆర్ఎస్ అభ్యర్ధి

Satyam NEWS

OTC New Penis Pills

Bhavani

టీవీ 9 వ్యవస్థాపకుడు రవిప్రకాశ్ అరెస్టు

Satyam NEWS

Leave a Comment