36.2 C
Hyderabad
April 25, 2024 22: 37 PM
Slider ఆదిలాబాద్

మహిళలపై నేరాలను ఆపేందుకు అప్రమత్తంగా ఉండండి

nirmal police

మహిళలపై నేరాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు తెలిపారు. నిర్మల్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారులు డిఎస్పీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు సలహాలు సూచనలు ఇచ్చారు.

పోలీస్ స్టేషన్లో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ఉండాలని మనం మాట్లాడే ప్రతి మాట ప్రజలు గమనిస్తున్నారని వారు చెప్పే మాటలు వారి బాధను పూర్తిగా విన్న తర్వాత మాట్లాడాలని తెలిపారు. పోలీసు విధులు, క్రమశిక్షణ, బాడీ లాంగ్వేజ్, తదితర అంశాలను మన యొక్క నడవడికను ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఉండాలన్నారు.

ఏదైనా సంఘటన జరగకముందే ముందస్తు సమాచారాన్ని సేకరించి సంఘటన జరగకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైనా రాత్రి సమయంలో కానీ మరే ఇతర సమయాలలో కానీ వేరే పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చిన దరఖాస్తులను త్వరగా స్వీకరించి తగు చర్యలు తీసుకోవాలన్నారు.

భారతదేశంలోనే ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని విధినిర్వహణలో ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలన్నారు. పోలీసులు వినియోగిస్తున్న టెక్నాలజీ డయల్ 100,  హాక్ ఐ, తదితర సేఫ్టీ గురించి గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు గ్రామాల ప్రజలకు, యువకులకు, పెద్దలకు మరియు కాలేజీ స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు.

ప్రజలు డయల్ 100 ద్వారా ఏసహాయం కోరినా  సంపూర్ణమైన సేవలు అందించాలని ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. సీసీ కెమెరాలు లేని ప్రదేశాలలో మహిళల రక్షణ గురించి సీసీ కెమెరాలు ఏర్పాటు గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

రాత్రి సమయంలో పెట్రోల్ కార్, బ్లూ కోల్ట్స్ సిబ్బంది అనుమానం వచ్చినా ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని, అనుమానాస్పద వ్యక్తులను విచారించాలని ఆయన చెప్పారు. కాలేజీలలో స్కూళ్లలో గ్రామాలలో ఉన్న మహిళ కమిటీలతో మహిళా పోలీసులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మహిళలకు రక్షణ గురించి ఉన్న చట్టాలను గురించి తెలపాలని సూచించారు.

మహిళలపై జరుగుతున్న దాడులకు సంబంధించిన కేసులలో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని, ప్రతి చిన్న విషయాన్ని అన్ని కోణాలలో కేసు పరిశోధన చేసి శిక్షలు పడేటట్లు చేయాలని నేరస్తులకు శిక్ష పడ్డప్పుడే నేరాలు తగ్గుముఖం పడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్ పి శ్రీనివాసరావు, డిఎస్పి ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

కాంగ్రెస్ కార్యకర్తలను చూసి ఎగిరిపడద్దు బిడ్డ రేవంత్ రెడ్డి

Satyam NEWS

రైతుల ఉసురు పోసుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాలు

Satyam NEWS

ఉక్రెయిన్ రష్యా మధ్య చర్చలు విఫలం: యుద్ధం కొనసాగింపు

Satyam NEWS

Leave a Comment