33.2 C
Hyderabad
April 25, 2024 23: 00 PM
Slider మహబూబ్ నగర్

పోలీసులు నైతిక విలువలతో మెలగాలి

nagarkurnool sp

ఉన్నతాధికారి నుండి కానిస్టేబుల్,  హోమ్ గార్డు వరకు బాధ్యతాయుతం గా వ్యవహరించాలని తెలంగాణ రాష్ట్ర పోలీస్ డీ.జీ.పీ యం. మహేందర్ రెడ్డి డీ.జీ.పీ కార్యాలయం నుంచి నేడు వీడియో సమావేశాన్ని నిర్వహించారు. ఈ వీడియో సమావేశానికి నాగర్ కర్నూల్ జిల్లా నుండి   ఎస్పి డాక్టర్ వై. సాయి శేఖర్ తమ  కార్యాలయ సిబ్బంది తో  కలిసి పాల్గొన్నారు.

ఈ సమావేశం అయిన తర్వాత నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పి డాక్టర్ వై . సాయి శేఖర్  సిబ్బంది  తో మాట్లాడుతూ పఠాన్ చెరు లో జరిగిన దురదృష్ట సంఘటనల వల్ల మొత్తం పోలీస్ శాఖ అప్రతిష్ట పాలు అయ్యే అవకాశం ఏర్పడిందని అన్నారు. నైతిక విలువలు, మానవీయత తదితర అంశాలపై పోలీస్ అధికారులు, సిబ్బందికి నిరంతరం పునశ్చరణ నిర్వహించాలని సూచించారు.  ఇలాంటి  దురదృష్టకర సంఘటనలు పునరావృత్తం కాకుండా ఉన్నతాధికారి నుండి కానిస్టేబుల్,  హోమ్ గార్డు వరకు బాద్యతాయుతం గా వ్యవహరించాలని సూచించారు.  

Related posts

బండి సంజయ్ అభిమాని ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

జగన్ కు పోటీగా ఏపిలో కొత్త పార్టీ ఆవిర్భవిస్తుందా???

Satyam NEWS

వృద్ధులకు పెద్ద కొడుకు కేసీఆర్‌

Murali Krishna

Leave a Comment