27.7 C
Hyderabad
April 20, 2024 01: 44 AM
Slider నిజామాబాద్

కొనసాగుతున్న జూదం: పట్టించుకోని స్థానిక పోలీసు యంత్రాంగం

#playing cards den

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో భారీ స్థాయిలో పేకాట నిర్వహిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు.  అయా మండలాలతోపాటు గ్రామాలకు కూడా ఈ జాఢ్యం విస్తరించింది. పంట చేలు వీరికి అడ్డాలుగా మారుతున్నాయి.

గత దీపావళి పండుగ సందర్భంగా వివిధ  ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న పలువురికి టాస్క్ఫోర్స్ బృందం పట్టుకుని లక్షలాది రూపాయలు తోపాటు కేసును నమోదు చేసింది. కానీ స్థానిక పోలీస్ యంత్రాంగం మాత్రం అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.

నియోజకవర్గంలో ప్రధానంగా జుక్కల్, మద్నూర్, పెద్దకొడప్గల్, బిచ్కుంద,పిట్లం, నిజాంసాగర్   మండలాలలో  అధికార పార్టీ నాయకులే పేకాట స్థావరాలను ఏర్పాటు చేసి కేటిల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారని బహిరంగంగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బిచ్కుంద మండల మండలంలోని  పెద్దదేవాడ గ్రామంలో ఇరవై అయిదు మంది పేకాట రాయుళ్లను టాస్క్ఫోర్స్ బృందమే మళ్లీ రంగంలోకి దిగి పట్టుకుంది.

కానీ స్థానిక పోలీస్ యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండడం గమనార్హం దీంతో మరొక్కసారి స్థానిక పోలీస్ యంత్రాంగం నిర్లక్ష్యం బహిర్గతమైంది. ఇప్పటికే ఈ పేకాట స్థావరాల లో సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్ర కర్నాటకతో పాటు తెలంగాణ ప్రాంత సరిహద్దు  బడా పేకాటరాయుళ్లు పాల్గొంటారని సమాచారం కారణం పేకాట ఆడటానికి వచ్చిన వారికి నిర్వాహకులు అన్ని సకల సౌకర్యాలు కల్పిస్తున్నారని  మందు విందులు కూడా ఈ స్థావరాలలో ప్రత్యేకం, లాక్డౌన్ ఉండడం కూడా వీరికి కలిసొచ్చిన అంశంగా మారిందని పలువురు బాహాటంగానే తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా స్థానిక పోలీసు యంత్రాంగం మొద్దునిద్ర వీడాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.లేని యెడల పోలీస్ వ్యవస్థకే మచ్చ తెచ్చేలా వీరి వ్యవహారం కొనసాగుతుండటం గమనార్హం. గతంలో పేకాట నే కాకుండా అక్రమ ఇసుక రవాణాను కూడా టాస్క్ఫోర్స్ అధికారులు   పట్టుకోవడం   గతంలో చర్చనీయాంశంగా మారింది. మరి మన సార్ల తీరు  మారుతుందో లేదో వేచిచూడాల్సిందే మరి.

Related posts

బీసీలకు అన్యాయం చేసిన వైసిపిని తిరస్కరించాలి

Satyam NEWS

బ్యాంకుల్లో క‌రోనా నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేయాలి

Satyam NEWS

ప్రమాద సమయంలో సమయస్ఫూర్తితో మెలగాలి

Satyam NEWS

Leave a Comment