అమరావతి JAC తలపెట్టిన బంద్ సందర్భంగా అవాంఛనీయ ఘటనలలో పాల్గొనే వారి పైన చట్టబద్దమైన చర్యలు తీసుకుటామని గుంటూరు అర్బన్ ఎస్పీ పి.హెచ్.డి. రామకృష్ణ, గుంటూరు రూరల్ ఎస్పీ సిహెచ్. విజయరావు తెలిపారు. గుంటూరు అర్బన్, రూరల్ పరిధుల్లో విద్యార్ధులకు, ఉద్యోగులకు, సాధారణ ప్రజలకు పబ్లిక్, ప్రయివేటు రవాణాకు ఇబ్బంది కలిగే విధంగా ఎవ్వరూ అవాంఛనీయ కార్యక్రమాలు నిర్వహించరాదని కోరారు.
బలవంతంగా షాపులు, విద్యాసంస్థలు మూయించడం చేయవద్దని కోరారు. బంద్ సందర్భంగా సంఘ విద్రోహ శక్తులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాల లో పాల్గొన్న వారిపైన సంబంధిత చట్టాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.