35.2 C
Hyderabad
April 24, 2024 13: 07 PM
Slider ఆదిలాబాద్

పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణంలో పోలీస్ స్టేషన్లు

#adilabad police

పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వచ్చే బాధితులకు పచ్చని చెట్లు ఆహ్వానించేలా ఉండాలనే ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు మంగళవారం సిఐ కే. పురుషోత్తం చారి ఆధ్వర్యంలో ఇంచార్జ్ ఎస్ఐ దడిగే రాధిక, సిబ్బందితో కలిసి మావాల పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో 200 మొక్కలు నాటి నీరు పోశారు.

ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ విశాలంగా ఉన్న పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో 200 మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత సిబ్బందికి అప్పగించినట్లు తెలిపారు.

పచ్చని చెట్లతోనే మానవ జీవన వ్యవస్థ ఆధారపడి ఉందని, విపరీతంగా పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటీ, సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుళ్లు ఈ ప్రభాకర్, ఆర్ ధర్ము, కానిస్టేబుళ్లు ఎం ఏ సయీద్,జే. మహేందర్, తదితరులు పాల్గొన్నారు.

మావాల పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో పోలీసులు 200 మొక్కలు నాటారు. జైనథ్ సిఐ కొంక మల్లేష్ ఆధ్వర్యంలో మాకోడ గ్రామ రోడ్డుపై పోలీసులు 100 మొక్కలు నాటారు.

Related posts

రేవంత్ రెడ్డి రాజీవ్ రైతు పాదయాత్రలో వనపర్తి కాంగ్రెస్ నేతలు

Satyam NEWS

దీపావళి సందర్భంగా పితృదేవతలకు ప్రత్యేక పూజలు

Satyam NEWS

నెల రోజులు నడవకూడదు కాబట్టి ప్రచారానికి రాలేకపోయాను

Satyam NEWS

Leave a Comment