22.2 C
Hyderabad
December 10, 2024 11: 17 AM
Slider మహబూబ్ నగర్

పోలీస్ ప్రజావాణిలో 14 ఫిర్యాదులు

#police

వనపర్తి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా అదనపు ఎస్పీ  రాందాస్ తేజావత్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 14 మంది ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ ల యొక్క ఎస్సై,  సిఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య  పరిష్కారానికి సూచనలు చేశారు.

ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకోవాలని కోరారు. వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకొనేల, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని జిల్లా అదనపు ఎస్పీ చెప్పారు. వనపర్తి పోలీస్ ప్రజావాణిలో  మొత్తం 14 ఫిర్యాదులు, భూతగాదాలకు సంబంధించిన ఫిర్యాదులు, పరస్పర గొడవల ఫిర్యాదులు, భార్యభర్తల కు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

తెలంగాణపై వివక్ష: పార్లమెంటులో పోరాటానికి కేసీఆర్ ఆదేశం

Satyam NEWS

ఇకపై నా జీవితం ఈ “డైరెక్షన్”లో మాత్రమే!!

Satyam NEWS

మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా

Satyam NEWS

Leave a Comment