ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన వార్తలు విశేషాలు విస్తృతంగా ప్రచారం కాకుండా పోలీసులు అడ్డుకుంటున్న విచిత్ర సంఘటన ఇక్కడ జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె నేటి నుంచి ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నాగర్ కర్నూల్ డిపో లో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. నాగర్ కర్నూల్ డిపోకు సంబంధించిన ప్రవేట్ బస్సు కొల్లాపూర్ కు వెళుతున్న దారిలో పెద్దకొత్త పల్లి మండలం సాతపూర్ గ్రామ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో ధ్వంసం చేశారు. బస్సు వెనుక భాగంలో అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈ ఫోటో చిత్రాలను సోషల్ మీడియాలో యువకులు షేర్ చేస్తుంటే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొల్లాపూర్ డిపోకు సంబంధించిన బస్సు వెనుక పోలీస్ కాన్వాయ్ ఫాలో అయ్యే విధంగా సిఐ బి.వెంకట్ రెడ్డి జాగ్రతలు తీసుకున్నారు. ఆర్టీసీ కార్మికులు పూర్తి మొత్తంలో సమ్మె చేస్తున్నారు. డిపో మేనేజర్ ఒక్కరే విధుల్లో వున్నారు. ప్రవేట్ వ్యక్తులతో బస్సు లను నడిపిస్తున్నారు
previous post