29.2 C
Hyderabad
November 4, 2024 19: 11 PM
Slider మహబూబ్ నగర్

పరువు హత్య జరగకుండా చొరవ తీసుకున్న పోలీసులు

#LoveMarriage

మరో పరువు హత్య జరగకుండా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సీఐ వెంకట్ రెడ్డి ఆపారు. ప్రేమ జంట తల్లిదండ్రులను కౌన్సిలింగ్ చేసి ఇరు కుటుంబాలకు రాజీ కుదిర్చారు.

పెద్దకొత్తపల్లి కి చెందిన కుసుమ (19) డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నది. కుసుమ పెంట్ల వెల్లి మండలం వెంగంపల్లి తండాకు చెందిన ఆర్ చిదంబర్ నాయక్ ను ప్రేమించింది. చిదంబర్ డైట్ సెట్ పూర్తి చేశాడు.

నాలుగు రోజుల కిందట అకస్మాత్తుగా కుసుమ కనిపించకుండా పోవడంతో ఆమె తల్లిదండ్రులు నర్సింహ, మంగీబాయి పెద్ద కొత్త పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తమ కుమార్తె కనిపించడం లేదని ఎక్కడికెళ్లిందో అర్ధం కావడం లేదని వారు పోలీసులకు చెప్పారు. దాంతో కేసు నమోదు చేసుకున్న పెద్ద కొత్త పల్లి ఎస్ ఐ నాగన్న దర్యాప్తు ప్రారంభించారు.

అయితే నేడు కుసుమ తిరిగి వచ్చింది. ఆమెతో బాటు చిదంబర్ నాయక్ కూడా ఉన్నాడు. ఇద్దరూ ఆంధ్ర ప్రాంతానికి వెళ్లి అక్కడ పెళ్లి చేసుకుని నాలుగు రోజుల తర్వాత తిరిగి వచ్చారు.

అల్లారుముద్దుగా కనిపెంచిన తమ కుమార్తె చేసిన పనికి ఒక్క సారిగా హతాశులైన నర్సింహ, మంగీబాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ ఐ నాగన్న వారందరిని పోలీస్ స్టేషన్ కు పిలిచారు.

అక్కడ నుంచి వారందరిని కొల్లాపూర్ సీఐ వెంకట్ రెడ్డి దగ్గరకు తీసుకువచ్చారు. తాను ఇష్టపడి చిదంబర్ నాయక్ ను పెళ్లి చేసుకున్నట్లు కుసుమ పోలీసులకు తెలిపింది.

తాను మేజర్ నని ఆధారాలు కూడా పోలీసులకు సమర్పించింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని తాను ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నట్లు చెప్పడంతో ఆమె తల్లిదండ్రులకు, చిదంబరం తల్లిదండ్రులకు సీఐ కౌన్సిలింగ్ చేశారు.

రెండు కుటుంబాలూ అంగీకరించేలా చేయడంతో వారంతా పోలీసులకు ధన్యవాదాలు చెప్పి ఇంటికి వెళ్లారు.

Related posts

ఘనంగా రుక్మిణీ, సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణం

Satyam NEWS

రామాపురం భూముల పై సమగ్ర విచారణ చేపట్టాలి

Satyam NEWS

ఖమ్మంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్  ఆంక్షలు

Satyam NEWS

Leave a Comment