27.7 C
Hyderabad
April 24, 2024 07: 11 AM
Slider కరీంనగర్

లాక్ డౌన్ సమయంలో ఏం చేయాలి?…వీరేం చేశారో చూడండి

#SircillaPolice

లాక్ డౌన్ సమయంలో ఏం చేయాలి? ఇంట్లో ఉండాలి. ఇంట్లో ఉండి ఏం చేయాలి? ఏం చేస్తాం… ఏమీ చేయలేం….. ఇలా అలోచించిన కొందరు పేకాట క్లబ్ ను ప్రారంభించేశారు.

డబ్బులు పందెం కాస్తూ కులాసాగా పేకాడుతున్న వారిని రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు కటకటాల వెనక్కు నెట్టారు. ఎల్లారెడ్డిపేట్ మండలంలో  పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మికంగా దాడి చేశారు.

విశ్వసనీయ సమాచారం అందడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఈ దాడికి ఆదేశాలు ఇచ్చారు. దాంతో  టాస్క్ ఫోర్స్ ఎస్.ఐ, సిబ్బంది ఎల్లారెడ్డిపేట్ మండలం వెంకటాపురం గ్రామ శివారులోని ఈ పేకాట స్థావరంపై దాడి చేశారు.

మొత్తం 8 మందిని అరెస్ట్ చేయగా మరో ఇద్దరు పరారీ అయ్యారు. వారి నుంచి 15,750 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం ఎల్లారెడ్డిపేట్ మండల పోలీస్ స్టేషన్ లో  అప్పగించారు.

పోలీసులు అరెస్టు చేసిన వారిలో 1.kodapaka srider, 2.matta sheesh kumar, 3.Burra Rajendraprasad, 4.Mallarapu Ramesh, 5.pittlala parsharamulu, 6.chakali Rajaiah, 7.Gaddam Ravi, 8. Kodi Srikanth, 9.gontte Parsharamulu, 10.kukkala Rajaiah. ఉన్నారు.

ఈ టాస్క్ లో టాస్క్ ఫోర్స్ ఎస్.ఐ రాంరెడ్డి, ఆక్సర్, రమేష్, ప్రమోద్, తిరుపతి ఎల్లారెడ్డిపేట్ పీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

పోరాడి సాధించిన పీడీఎస్ రైస్ బండి ..!

Satyam NEWS

డిమాండ్: వలసకూలీలను ప్రభుత్వం ఆదుకోవాలి

Satyam NEWS

హైకోర్టు జడ్జికి శుభాకాంక్షలు తెలిపిన సుధా నాగేందర్

Satyam NEWS

Leave a Comment