27.7 C
Hyderabad
April 20, 2024 00: 22 AM
Slider విజయనగరం

కర్ఫ్యూ సడలింపు: నిబంధనల అమలుపై సడలిన ఖాకీలు..!

#traffic police

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత కర్ఫ్యూ సడలింపు సమయాన్ని ప్రభుత్వం పొడిగించింది. మధ్యాహ్నం 12 వరకు ఉన్న సమయాన్ని మరో రెండు గంటలు పొడిగింపు ఉదయం 6 నుంచీ మధ్యాహ్నం 2 వరకూ సడలించింది.

ఈ నేపధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు నిబంధనలు పట్ల కాస్త మెతకవైఖిరిని అవలంబిస్తున్నారు. ఈ క్రమంలో నే విజయనగరం జిల్లా లో పోలీసులు.. ఆ రకంగా నే సడలింపు నిబంధనల ను అమలు చేస్తున్నారు.

తాజాగా జిల్లా లోని మూడు డివిజన్ పరిధులలో డీఎస్పీల ఆధ్వర్యంలో సిబ్బంది కర్ఫ్యూ నిబంధనల సడలింపు పొడిగించిన అనంతరం సిబ్బందికి తగు రీతిలో సూచనలిస్తూ విధులు నిర్వర్తించసాగారు.

ఈ మేరకు జిల్లా కేంద్రంలో అటు ట్రాఫిక్ డీఎస్పీ, ఇటు లా అండ్ ఆర్డర్ డీఎస్పీ లు..తమ, తమ సిబ్బందికి తగు సూచనలిస్తున్నారు. మరోవైపు ఎస్పీ సైతం కర్ఫ్యూ వేళల సడలింపు సందర్భంగా 2 గంటల తర్వాత ఏ ఒక్కరైనా రోడ్ మీద కనిపిస్తే జరీమాన  విధించాలని సిబ్బందికి ఆదేశించారు.

ఇందులో భాగంగా ఎస్పీ…నగరంలో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆర్టీసీ కాంప్లెక్స్, బాలాజీ జంక్షన్ ల వద్ద సిబ్బంది నిర్వహిస్తున్న విధులను పరిశీలించారు. ఈ క్రమంలో నే ఎంఆర్ కాలేజీ వద్ద ట్రాఫిక్ డీఎస్పీ మోహన్ రావు..తన సిబ్బంది చే 2 గంటల తర్వాత రోడ్ మీదకు వచ్చిన వారికి 500 రూపాయలు జరీమాన విధించారు.

ఏది ఏమైనా ఓ వైపు కేసులు తగ్గడం అదే సమయంలో కర్ఫ్యూ సడలింపు వేళలను పొడిగించడం..తద్వారా పోలీసు నిర్వర్తించాల్సిన విధులు కాస్త తగ్గాయంటోంది సత్యం న్యూస్. నెట్.

Related posts

కామారెడ్డి జిల్లాలో 13 మంది అభ్యర్థుల రిజెక్ట్

Satyam NEWS

జనతా కర్ఫ్యూ పాటించాలని హైదరాబాద్ పోలీసు పిలుపు

Satyam NEWS

ఆడియన్స్ “పల్స్” పట్టుకుంటారని గట్టిగా నమ్ముతున్నాను

Satyam NEWS

Leave a Comment